iDreamPost
android-app
ios-app

హరి హర వీరమల్లు OTT స్ట్రీమింగ్ అప్పుడేనా !

  • Published Aug 01, 2025 | 4:18 PM Updated Updated Aug 01, 2025 | 4:18 PM

పవన్ కళ్యాణ్ నుంచి తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో.. అభిమానులంతా చాలా ఈగర్ గా సినిమా కోసం వెయిట్ చేశారు. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత సినిమా రిలీజ్ అయింది. సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు ఎ.ఎం.రత్నం. పైగా మొదటి సారి పవన్ కళ్యాణ్ స్వయంగా తానే ప్రమోషన్స్ చేసారు.

  • Published Aug 01, 2025 | 4:18 PMUpdated Aug 01, 2025 | 4:18 PM
హరి హర వీరమల్లు OTT స్ట్రీమింగ్ అప్పుడేనా !

పవన్ కళ్యాణ్ నుంచి తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో.. అభిమానులంతా చాలా ఈగర్ గా సినిమా కోసం వెయిట్ చేశారు. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత సినిమా రిలీజ్ అయింది. సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు ఎ.ఎం.రత్నం. పైగా మొదటి సారి పవన్ కళ్యాణ్ స్వయంగా తానే ప్రమోషన్స్ చేసారు. దీనితో సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలకు తగినట్టే హరి హర వీరమల్లుకు గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కాయి. కానీ ఊహించని రీతిలో VFX దెబ్బకొట్టడంతో సినిమా బాక్స్ ఆఫీస్ ముందు ఫెయిల్యూర్ గా నిలిచిపోయింది. దీనితో మొత్తం మీద మూవీ రూ. 110 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ మాత్రమే సాధించినట్లు తెలుస్తుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ డీల్ ప్రకారం ఆగస్ట్ 22 న ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయాలనీ అనుకున్నారట. అయితే ఇప్పుడు ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో.. అనుకున్న డేట్ కంటే ముందే ఓటిటి లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట. ఆగస్టు 15 న ఇండిపెండెన్స్ డే కాబట్టి.. ఆ సంధర్బంగా హరి హర వీరమల్లు స్ట్రీమింగ్ చేయాలనీ చూస్తున్నారట. అదే కనుక జరిగితే 30 రోజుల్లోనే ఓటిటికి వచ్చినట్లు అవుతుంది, దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. సో దీనిలో ఎంతవరకు నిజం ఉందో.. మేకర్స్ ఏ క్లారిటీ ఇవ్వాలి. మరి ఏ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.