Swetha
కొన్ని సినిమాలు థియేటర్ లో మెప్పించకపోయిన ఓటిటి లో మాత్రం అదరగొడుతూ ఉంటాయి. ఈ సంప్రదాయం ఎప్పటినుంచో వస్తూనే ఉంది. భారీ అంచనాలతో థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన సినిమాలు.. ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ సంపాదించుకున్నాయి. ఇక అంతా అయిపొయింది అనుకుని ఓటిటి రిలీజ్ చేసేస్తారు. ఇక అప్పటినుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఏ సినిమా అయితే థియేటర్ లో డిజాస్టర్ అనిపించుకుందో ..

కొన్ని సినిమాలు థియేటర్ లో మెప్పించకపోయిన ఓటిటి లో మాత్రం అదరగొడుతూ ఉంటాయి. ఈ సంప్రదాయం ఎప్పటినుంచో వస్తూనే ఉంది. భారీ అంచనాలతో థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన సినిమాలు.. ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ సంపాదించుకున్నాయి. ఇక అంతా అయిపొయింది అనుకుని ఓటిటి రిలీజ్ చేసేస్తారు. ఇక అప్పటినుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఏ సినిమా అయితే థియేటర్ లో డిజాస్టర్ అనిపించుకుందో .. అదే సినిమా ఓటిటి లో టాప్ ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ క్రమంలో గత నెలలో థియేటర్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న సిద్దార్ద్ 3BHK , నితిన్ తమ్ముడు సినిమాలు ఈ వారం ఓటిటి ఎంట్రీ ఇచ్చేశాయి.
ఒక మధ్య తరగతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్. దానికోసం పైసా పైసా కూడబెట్టి ఫ్యామిలీ అంతా కలిసి కల కంటూ ఉంటారు. 3BHK సినిమా పూర్తిగా ఇలాంటి ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లోనే తెరకెక్కింది. స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు కానీ.. తెలుగులో కూడా రిలీజ్ అయింది. కాబట్టి ఈ వీకెండ్ కుటుంబం అంత కలిసి కూర్చుని చూడడానికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక ఇది కాకుండా నితిన్ నటించిన తమ్ముడు సినిమా. ఈ సినిమా మీద నితిన్ చాలా నమ్మకాలూ పెట్టుకున్నాడు. అతనికి కంబ్యాక్ సినిమాగా నిలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా ఆ రేంజ్ ను అందుకోలేకపోయింది. దీనితో నెల రోజుల్లోనే మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇది కూడా ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే సినిమానే. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ వీకెండ్ ఈ రెండు సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. వెండితెర మీద ప్లాప్ అయిన ఈ మూవీస్ ఓటిటి లో ఎలాంటి టాక్ సంపాదించుకుంటాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.