Swetha
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మూవీ మేకర్స్. విజయ్ కు కూడా ఇప్పటివరకు వరుస ప్లాప్స్ పడడంతో.. ఈ సినిమా విజయ్ కు చాలా కీలకం కానుంది. ముందు ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కింగ్డమ్ కు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి.
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మూవీ మేకర్స్. విజయ్ కు కూడా ఇప్పటివరకు వరుస ప్లాప్స్ పడడంతో.. ఈ సినిమా విజయ్ కు చాలా కీలకం కానుంది. ముందు ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కింగ్డమ్ కు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి.
Swetha
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మూవీ మేకర్స్. విజయ్ కు కూడా ఇప్పటివరకు వరుస ప్లాప్స్ పడడంతో.. ఈ సినిమా విజయ్ కు చాలా కీలకం కానుంది. ముందు ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కింగ్డమ్ కు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే టాక్ మాత్రం ఊహించిన రేంజ్ లో రాలేదు. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఇంకాస్త ఉంటే బావుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్లేవారికి మాత్రం మూవీ పరవాలేదని అనిపిస్తుంది.
సో ప్రస్తుతానికి సినిమాపై మిక్సెడ్ టాక్ వస్తుంది. సో ఓ రకంగా విజయ్ డిజాస్టర్ ట్రాక్ నుంచి బయటపడినట్లే. అయితే సినిమాకు సెకండ్ పార్ట్ ను ప్రకటించడం ఇంకో మైనస్ గా అనిపించుకుంది. చెప్పాల్సిందంతా మొదటి పార్ట్ లోనే చెప్పేస్తే మూవీకి ఓ మంచి క్లోజర్ ఇచ్చినట్లు అవుతుందని సగటు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి మిక్సెడ్ టాక్ తో సినిమా థియేటర్ లో ఎంత వరకు నెట్టుకొస్తుందో చూడాలి. నిజానికి కింగ్డమ్ మూవీకి రెండు వారాలు ఓపెన్ గ్రౌండ్ దొరికింది. కానీ ఇప్పుడు వస్తున్న టాక్ ప్రకారం మూవీ ఎంత సాధిస్తుంది అనేది వీకెండ్ గడిస్తే కానీ చెప్పలేము.
ఇక ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ విషయానికొస్తే.. సినిమా రిలీజ్ కు ముందే.. కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఓటిటి డీల్ ప్రకారం సినిమాను నెల రోజుల తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ కు వదులుతారు. కానీ ఇపుడు థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఈ డెసిషన్ మారినా ఆశ్చర్యం లేదు. మరి ఈ మూవీ వీకెండ్ లో ఎలాంటి హోల్డ్ ను కబరుస్తుందో చూడాలి . ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.