Kingdom Movie Review in Telugu: ఈ సినిమా విజయ్ కు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందని అంతా బలంగా నమ్మారు. పైగా అటు ప్రమోషన్స్ , ఇటు మ్యూజిక్ , యాక్షన్స్ సీన్స్ పరంగా సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ జోరు చూపించింది కింగ్డమ్. ఇక ఇప్పుడు రిలీజ్ తర్వాత మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది.. ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూసేద్దాం.
Kingdom Movie Review in Telugu: ఈ సినిమా విజయ్ కు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందని అంతా బలంగా నమ్మారు. పైగా అటు ప్రమోషన్స్ , ఇటు మ్యూజిక్ , యాక్షన్స్ సీన్స్ పరంగా సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ జోరు చూపించింది కింగ్డమ్. ఇక ఇప్పుడు రిలీజ్ తర్వాత మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది.. ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూసేద్దాం.
Swetha
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ గురించి గత కొన్నిరోజులుగా పోజిటివ్ హైప్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విజయ్ కు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందని అంతా బలంగా నమ్మారు. పైగా అటు ప్రమోషన్స్ , ఇటు మ్యూజిక్ , యాక్షన్స్ సీన్స్ పరంగా సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ జోరు చూపించింది కింగ్డమ్. ఇక ఇప్పుడు రిలీజ్ తర్వాత మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది.. ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూసేద్దాం.
కథ :
కింగ్డమ్ కథ విషయానికివస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే అతను చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోతాడు. అలాగే తన అన్న శివ( సత్యదేవ్) తప్పిపోతాడు. దీనితో సూరి తన అన్నను వెతికే పనిలో ఉంటాడు. ఈ క్రమంలో అతను శ్రీలంక జాఫ్నాలో ఒక స్మగ్లింగ్ ముఠా నాయకుడిగా ఉన్నాడని తెలుస్తుంది. దీనితో తన అన్నను ఎలా అయినా అక్కడినుంచి తీసుకుని రావాలని సూరి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికోసం శ్రీలంకకు బయల్దేరతాడు. సూరి తానూ అనుకున్నట్లుగా శివను వెనక్కు తీసుకుని రాగలిగాడా లేదా ? ఈ క్రమంలో వారి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ? ఇందులో హీరోయిన్ రోల్ ఏంటి ? చివరికి కథ ఎలాంటి మలుపు తీసుకుంది.. ఇవన్నీ తెలియాలంటే వెండితెర మీద సినిమా చూడాల్సిందే.
నటీనటుల పని తీరు :
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ గురించే. విజయ్ ఈ సినిమాకోసం ప్రాణం పెట్టి పనిచేసాడు అనే రేంజ్ లో తన పెర్ఫామెన్స్ ఉంటుంది. ఓ రకంగా విజయ్ కు ఇది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పుకోవచ్చు. సాధారణ కానిస్టేబుల్ లా కనిపిస్తూ.. కథ ముందుకు సాగే కొద్దీ ఓ స్పై ఆపేరేషన్ ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయిన తీరు.. విజయ్ మార్క్ ను చూపిస్తుంది. ఇక సత్య దేవ్ క్యారెక్టర్ విషయానికొస్తే.. హీరోగా అన్నగా నటించనున్నాడు అని ముందు రివీల్ చేసినప్పటికీ.. సినిమా మొత్తం చూస్తే ఈ సినిమాకు సెకండ్ హీరోలా అనిపించే క్యారెక్టర్ సత్య దేవ్ ది. ఇద్దరు హీరోలు పోటాపోటీగా నటించినట్లు అనిపిస్తుంది. అయితే ఇక్కడ హీరోయిన్ భాగ్యశ్రీ బొర్స్సే కు తగిన న్యాయం జరగలేదేమో అనే ఫీలింగ్ వస్తుంది. కానీ స్క్రీన్ స్పేస్ దొరికినంతలో ఆమె అందంతో బాగానే ఆకట్టుకుంది. వీరు కాకుండా సత్యదేవ్తో పాటు వెంకటేష్ అనే కొత్త నటుడు సినిమాలో తమ పర్ఫామెన్స్తో అదరగొట్టాడు. ఇక మిగిలిన నటి నటులంతా కూడా తమ పాత్రల పరిధి మేర బాగానే ఆకట్టుకున్నారు.
టెక్నీకల్ విభాగం పనితీరు :
ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గౌతమ్ తిన్నానూరి గురించి. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజింగ్ గా రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్ రైటింగ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బావుండేదని అనిపించింది. అలాగే విఎఫ్ఎక్స్ ఉపయోగించినా కూడా వాటిని రియల్ లొకేషన్స్ తో మ్యాచ్ చేస్తూ.. సీన్స్ ను చాలా రియలిస్టిక్ గా చూపించిన తీరు బావుంది. కొన్ని సీన్స్ చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. మొత్తం మీద సినిమాటోగ్రఫీ బావుంది. ఇక అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. యాక్షన్ సిక్వెన్స్ లు హై ఫీలింగ్ ను ఇస్తాయి.. కానీ ఎమోషనల్ హై విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బావుండేదని ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్ గా టెక్నీకల్ టీమ్ తమ పనితనాన్ని బాగానే చూపించారు.
విశ్లేషణ :
కథను తెరపై చూపించడంలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్. కథ మొత్తం ట్రైలర్ లో చూపించి జనాన్ని థియేటర్స్ కు రప్పించగలిగే తీరు కొందరిదైతే.. కథను దాచి దాచి ఒకేసారి వెండితెరపై చూపించే తీరు కొందరిది. ఇక్కడ గౌతమ్ మొదటి సాహసమే చేసాడు. దాదాపు కథ అంతా ట్రైలర్ ను తెలిసిపోతూనే ఉంటుంది. అయినా సరే సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కాయి.సినిమా స్టార్టింగ్ లోనే ఇది ఒక పీరియాడిక్ డ్రామా అనే ఫీలింగ్ వస్తుంది. 1920లో శ్రీలంకలో కథను మొదలుపెట్టి.. 70 ఏళ్ల తరువాత ఆ కథకి కొనసాగింపుగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని చూపించడానికి ఓ పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు దర్శకుడు. చిన్నప్పుడే తండ్రిని హత్య చేసి పారిపోయిన తన అన్నను వెతుక్కుంటూ హీరో బయల్దేరతాడు. దానికోసం హీరో జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అని చూపించడంతో ఫస్ట్ హాఫ్ అంతా నీట్ గా సాగిపోతూ ఉంటుంది. హీరో తన అన్నని కలుసుకున్న దగ్గరనుంచి కథలో మలుపు తిరుగుతుంది. ఇక్కడవరకు దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యాడు.
ఇక సెకండ్ ఆఫ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం.. కొన్ని చోట్ల నేరేషన్ చాలా ఫ్లాట్ గా అనిపిస్తూ ఉంటుంది. కథ అంతా అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. కానీ నటీనటులు యాక్టింగ్ తో ప్రొపెర్ డ్రామా బిల్డ్ చేసి దానిని కాస్త కవర్ అప్ చేసేశారు. అక్కడక్కడ కాస్త తడబడినా ఓవరాల్ గా సెకండ్ ఆఫ్ కూడా పరవాలేదు అనిపించుకుంటుంది. మొత్తం మీద విజయ్ కింగ్డమ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. యాక్షన్ సీన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది.. కానీ ఎమోషనల్ పరంగా కథ ఇంకాస్త బలంగా ఉంటే బావుండేదని అనిపించకుండా ఉండదు. కథ రొటీన్ లా అనిపించినా గౌతమ్ కథను చూపించిన తీరు కాస్త కొత్తగానే ఉంటుంది.
ప్లస్ లు :
మైనస్ లు:
రేటింగ్ : 2.75/5
చివరిగా : ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూసేవారికి కింగ్డమ్ బెస్ట్ ఛాయిస్