Swetha
ఒకప్పుడు సినిమా అంటే మూడు గంటలలో కథ మొత్తాన్ని చూపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఎప్పుడైతే బాహుబలి రెండు భాగాలుగా వచ్చి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందో. అప్పటినుంచి చాలా సినిమాలు ఇలానే రెండు భాగాలుగా రావడం మొదలయ్యాయి. ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యి కొన్ని సినిమాలు మంచి రిజల్ట్స్ నే అందుకున్నాయి.
ఒకప్పుడు సినిమా అంటే మూడు గంటలలో కథ మొత్తాన్ని చూపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఎప్పుడైతే బాహుబలి రెండు భాగాలుగా వచ్చి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందో. అప్పటినుంచి చాలా సినిమాలు ఇలానే రెండు భాగాలుగా రావడం మొదలయ్యాయి. ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యి కొన్ని సినిమాలు మంచి రిజల్ట్స్ నే అందుకున్నాయి.
Swetha
ఒకప్పుడు సినిమా అంటే మూడు గంటలలో కథ మొత్తాన్ని చూపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఎప్పుడైతే బాహుబలి రెండు భాగాలుగా వచ్చి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందో. అప్పటినుంచి చాలా సినిమాలు ఇలానే రెండు భాగాలుగా రావడం మొదలయ్యాయి. ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యి కొన్ని సినిమాలు మంచి రిజల్ట్స్ నే అందుకున్నాయి. కానీ ప్రతి సినిమాను రెండు భాగాలుగా తీయాలి అనుకోవడం ఇప్పుడు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సిక్వెల్ ఫార్ములా అన్ని సినిమాలకు పని చేయడం లేదు. ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా అలాగే ఉంది.
భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన ఇండియన్2 ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుందో తెలియనిది కాదు. ఇక రీసెంట్ గా వచ్చిన హరి హర వీరమల్లు సినిమా కూడా సిక్వెల్ అవసరమా అనే టాక్స్ ఏ ఎక్కువ వినిపిస్తున్నాయి. ఒక పార్ట్ లో చక్కగా కంప్లీట్ చేయాల్సిన సినిమాను రెండు పార్ట్శ్ గా అనవసరంగా పెట్టారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. సరే ఇవన్నీ పాత కథలు అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమాకు కూడా ఇదే బాటలో నడుస్తుంది. మొదట కింగ్డమ్ మూవీ రెండు పార్ట్శ్ అని ఎవరు అనుకోలేదు. మొదటి పార్ట్ వరకు కింగ్డమ్ కథా నేపథ్యం అంతా బాగానే సాగిపోయింది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా మూవీ చూస్తే మాత్రం పరవాలేదని అనిపిస్తుంది. కానీ పార్ట్ 2 కూడా ఉంది అన్నట్లు క్లోజర్ ఇవ్వడం గురించి మాత్రం ప్రేక్షకుల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఏ వస్తుంది.
మొదటి పార్ట్ ప్రేక్షకులకు కంప్లీట్ శాటిస్ఫాక్షన్ ఇవ్వనప్పుడు ఇంకా రెండో పార్ట్ మీడియా ఎందుకు ఆసక్తి కలుగుతుంది.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ లెక్కన అటు హరి హారకు కానీ ఇటు కింగ్డమ్ కు కానీ రెండో భాగం ఉంటుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సిక్వెల్స్ చూసేందుకు అంత ఇంట్రెస్టేడ్ గా లేరు అనేది మరో వైపు వినిపిస్తున్న టాక్. ఒక సినిమాకు ప్రొపెర్ గా క్లోజర్ ఇచ్చి.. దాని రిజల్ట్ ని బట్టి సిక్వెల్ ను ప్లాన్ చేస్తే బావుంటుంది అని అంతా చర్చించుకుంటున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరీ ఏ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.