Swetha
అప్ కమింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందరికి నోటా వినిపించేది ఒకే ఒక్క పేరు అదే OG. గత కొన్నేళ్లుగా పవన్ అభిమానులంతా OG నామస్మరణే చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా. అవి ఎలాంటి కిక్ ఇస్తాయా ఎలా సెలెబ్రేట్ చేసుకుందామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అప్ కమింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందరికి నోటా వినిపించేది ఒకే ఒక్క పేరు అదే OG. గత కొన్నేళ్లుగా పవన్ అభిమానులంతా OG నామస్మరణే చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా. అవి ఎలాంటి కిక్ ఇస్తాయా ఎలా సెలెబ్రేట్ చేసుకుందామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Swetha
అప్ కమింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందరికి నోటా వినిపించేది ఒకే ఒక్క పేరు అదే OG. గత కొన్నేళ్లుగా పవన్ అభిమానులంతా OG నామస్మరణే చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా. అవి ఎలాంటి కిక్ ఇస్తాయా ఎలా సెలెబ్రేట్ చేసుకుందామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ తో సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఇప్పుడు OG నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది.
రెండు రోజుల నుంచి ఈ ఫస్ట్ సింగిల్ పైన విపరీతమైన బజ్ క్రియేట్ అవుతూనే ఉంది. ఆగస్ట్ 2 తేదీ సాయంత్రం రిలీజ్ చేస్తామని చెప్పిన సాంగ్ ను..ఊహించని విధంగా ఇంకాస్త ముందే రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. ఓజస్ గంభీర అంటూ ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. సుజీత్ టేకింగ్, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ , థమన్ కంపోజింగ్ ప్రతి ఒక్కటి అదిరిపోయాయి అని చెప్పాల్సిందే. జాన్ విక్ స్టయిల్లో తమన్ ఈసారి తన మార్క్ ను చూపించాడు.
వీటికి యాడ్ ఆన్ గా జాపనీస్ ర్యాప్ ఇంకొక హైలెట్. ఇక దీనికంటే ముందు రిలీజ్ అయినా హంగ్రీ చీతాకు కూడా స్పెషల్ వెర్షన్ ను ప్లాన్ చేస్తున్నారట. ఏదైతేనేం పవన్ అభిమానులకు హరి హర చేసిన గాయం ఓజాస్ గంభీర తో మాయమైపోయినట్టుంది. మొత్తానికి OGతో పవన్ కళ్యాణ్ లెక్కలు తేల్చేలానే కనిపిస్తున్నాడు. ఏదేమైనా సెప్టెంబర్ 25 న OG రిలీజ్ అవ్వడం ఖాయం అని మరోసారి కన్ఫర్మ్ చేసేశారు. సో ఇక సినిమా నుంచి ముందు ముందు వచ్చే అప్డేట్స్ సినిమా రేంజ్ ను ..ఓపెనింగ్స్ రికార్డ్స్ ను డిసైడ్ చేయనున్నాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.