Swetha
ఆగస్టు నెల వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరైన సాలిడ్ సినిమా పడిందే లేదు. ఇక ఆగస్ట్ నెలలో అయినా కొత్త కళ వస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు థియేటర్ ఓనర్స్. ఇక ఈ నెల స్టార్టింగ్ లోనే విజయ్ సేతుపతి , నిత్యా మీనన్ 'సార్ మేడం' తెలుగులో రిలీజ్ అయింది. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ ఏ బయటకు వస్తుంది.
ఆగస్టు నెల వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరైన సాలిడ్ సినిమా పడిందే లేదు. ఇక ఆగస్ట్ నెలలో అయినా కొత్త కళ వస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు థియేటర్ ఓనర్స్. ఇక ఈ నెల స్టార్టింగ్ లోనే విజయ్ సేతుపతి , నిత్యా మీనన్ 'సార్ మేడం' తెలుగులో రిలీజ్ అయింది. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ ఏ బయటకు వస్తుంది.
Swetha
ఆగస్టు నెల వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరైన సాలిడ్ సినిమా పడిందే లేదు. ఇక ఆగస్ట్ నెలలో అయినా కొత్త కళ వస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు థియేటర్ ఓనర్స్. ఇక ఈ నెల స్టార్టింగ్ లోనే విజయ్ సేతుపతి , నిత్యా మీనన్ ‘సార్ మేడం’ తెలుగులో రిలీజ్ అయింది. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ ఏ బయటకు వస్తుంది. ఓ క్లీన్ కామెడీ మూవీ అంటూ ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు. వీటితో పాటు ఉసురే, థాంక్ యు డియర్, బాలీవుడ్ మూవీస్ సన్నాఫ్ సర్దార్ 2 , ధఢక్ 2 లాంటి మూవీస్ వచ్చేశాయి. వీటిలో ఏ సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.
ఆ తరవాత ఆగస్ట్ 8 న బకాసుర రెస్టారెంట్ మూవీ రానుంది. ఇవి కాకుండా రీరిలీజ్ ల రేసులో ఆగస్ట్ 9 మహేష్ పుట్టినరోజు సంధర్బంగా అతడు రీరిలీజ్ కానుంది. ఇవన్నీ ఒకెత్తయితే అసలైన ఆగస్టు 14 న వచ్చే కిక్ వేరే. ఆరోజు ఒకటి కాదు ఏకంగా రెండు భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. తారక్ స్ట్రెయిట్ బాలీవుడ్ ఎంట్రీ వార్ 2 మూవీ , అలాగే లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ కూలీ సినిమా. ఈ రెండు సినిమాల కోసం అభిమహులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మొదటి రోజు టాక్ బావుంటే కనుక ఈ రెండు సినిమాలు ఈసారి బాక్స్ ఆఫీస్ రికార్డ్ ను బ్రేక్ చేయడం ఖాయం.
ఆ తర్వాత ఆగస్టు 22 న అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ఈ టీం వెరైటీ పబ్లిసిటీ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కాకపోతే ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని క్లియర్ గా అర్థమైపోతుంది కనుక రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే చిరు బర్త్ డే సందర్బంగా స్టాలిన్ 4 కె వెర్షన్ రీరిలీజ్ చేయనున్నారు. ఇక ఆకారిగా ఆగస్ట్ నెల మాస్ మహారాజ్ రవి తేజ ‘మాస్ జాతర’ సినిమాతో ఎండ్ అవుతుంది. ఇలా ఆగస్టు నెల అంతా సినిమాల సందడి చేయనుంది. ఇక వీటిలో ప్రేక్షకులను ఏ మూవీ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.