Swetha
సూపర్ స్టార్ రజినీకాంత్ , స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ ఇద్దరి నుంచి సినిమాలు వస్తున్నాయంటే... స్పెషల్ గా ఓవర్ ప్రమోషన్స్ అవసరం లేదు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం , ఇందులో నాగార్జున , ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి క్యామియో ఉండడంతో.. ఇప్పుడు కూలీ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ , స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ ఇద్దరి నుంచి సినిమాలు వస్తున్నాయంటే... స్పెషల్ గా ఓవర్ ప్రమోషన్స్ అవసరం లేదు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం , ఇందులో నాగార్జున , ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి క్యామియో ఉండడంతో.. ఇప్పుడు కూలీ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Swetha
సూపర్ స్టార్ రజినీకాంత్ , స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ ఇద్దరి నుంచి సినిమాలు వస్తున్నాయంటే… స్పెషల్ గా ఓవర్ ప్రమోషన్స్ అవసరం లేదు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం , ఇందులో నాగార్జున , ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి క్యామియో ఉండడంతో.. ఇప్పుడు కూలీ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్ , గ్లిమ్ప్స్ అన్నిటిలో లోకేష్ మార్క్ కనిపించింది. ఇప్పటికే ఫ్యాన్స్ అంతా హై లో ఉన్నారనుకుంటే.. ఇప్పుడు వీళ్ళు ప్లాన్ చేసే ప్రమోషన్స్ కు ఒక్కొక్కరు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారన్నమాట వాస్తవం. అసలు ఇదేం స్ట్రాటజీ బాసు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అసలు అంతలా కూలీ మేకర్స్ ఏమి చేశారు అనే విషయానికొస్తే… కూలీ సర్వాంతర్యామి అనే రేంజ్ లో ఎక్కడ చుసిన ఈ సినిమా పేరే వినిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ పార్సిల్ చేసే బాక్సుల మీద పెద్ద పెద్ద కూలి స్టిక్కర్లు వేయించారు. దీనితో ఆ గెస్చర్ కస్టమర్స్ ను బాగా ఆకట్టుకుంది. అటు కర్ణాటక వెళ్లే బాక్సుల మీద కన్నడలో ప్రింట్ వేయడం.. ఉపేంద్రను రజినితో ఈక్వల్ గా హైలెట్ చేయడంతో రీజనల్ సెంటిమెంట్ బాగా వర్క్ అవుతుంది. అలాగే ఇటు తెలుగుకు వచ్చేసరికి నాగార్జున బ్రాండ్ ని క్యాష్ చేసుకుంటున్నారు. సో అలా అన్ని స్టేట్స్ ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసుకుంటున్నారు కూలీ మేకర్స్.
ఇవన్నీ ఒకెత్తయితే.. వచ్చే వారం చెన్నైలో జరిగే కూలీ ఈవెంట్ మరొక ఎత్తు అవుతుందని.. కోలివుడ్ వర్గాల్లో హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ ఈవెంట్ ను రెగ్యులర్ ఈవెంట్స్ లా కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. ఓ భారీ సినిమాకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో లైవ్ ఈవెంట్ ఉంటుందని.. ఇన్సైడ్ టాక్. సినిమా రిలీజ్ అయ్యేవరకు ఇలాంటి ఈవెంట్స్ , ప్రమోషన్స్ ఎదో ఒకటి రెగ్యులర్ గా ఉంటూనే ఉంటుందంట. మరి ఈ ఈవెంట్స్ కు రజిని అటెండ్ అవుతారా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనా కూలి సినిమా ఈసారి బాక్స్ ఆఫీస్ లెక్కలు తేల్చేలానే కనిపిస్తుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.