ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల తొలి దశ ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3:30 గంటల వరకు కొనసాగింది. పల్లె ఓటర్లు ఉత్సాహంలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు ఓటేసేందుకు ఆసక్తి చూపారు. టీడీపీ నాయకులు ఆరోపించినట్లుగా.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రశాంత వాతావారణంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం 2:30 గంటలకే 75.55 శాతం పోలింగ్ జరిగింది. ఇది మరింత పెరగనుంది. పంచాయతీ ఎన్నికలు కావడం […]
పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ కోసమంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకువచ్చిన ప్రైవేటు ఈ యాప్‌కు హైకోర్టులో మరోసారి బ్రేక్ పడింది. అనుమతులు లేనందున ఈ యాప్‌ను ఉపయోగంలోకి తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహణ తన సొంత వ్యవహారమన్నట్లు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ వాచ్ యాప్‌ను ఈ నెల 3వ తేదీన ఆవిష్కరించారు. […]
ఇప్పటి వరకూ పంచాయతీ ఎన్నికలు ప్రెసిడెంట్ ఎంపికలు వరికే మనం చూశాం. గ్రామానికి మొదటి పౌరుడిగా ఉండే సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన అనేక రాజకీయ కోణాలను మాట్లాడుకున్నాం. అసలు ఆ గ్రామం ఎలా నడుస్తుంది. గ్రామ నిర్వహణకు అభివృద్ధికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని ఖర్చు పెట్టేది ఎవరు..? ఇచ్చేది ఎవరు? అన్న విషయాలను ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అంటు […]
పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేయడం అత్యంత వివాదాస్పద అంశం. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా.. వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్జగన్ తన సమయాన్ని అంతా పాలనపైనే కేంద్రీకరించారు. ఈ బాధ్యతలను ఆయా శాఖల మంత్రులు తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలను పంచాయతీరాజ్ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, పురపాలక ఎన్నికలను ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి ఎంత […]
పంచాయతీ ఎన్నికల తొలి దశకు సమయం ఆసన్నమైంది. తుది పోటీలో ఎవరుండేది తేలిపోయింది. అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. నామినేషన్లు, అభ్యంతరాలు, ఉపసంహరణలు, పరిశీలన ప్రక్రియ దశలు ముగిశాయి. ఇక ప్రచారం ప్రారంభం కాబోతోంది. ఈ నెల 9వ తేదీన తొలి విడత పోలింగ్ జరగబోతోంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు భవితవ్యం ఆ రోజు సాయంత్రానికి తేలిపోనుంది. పంచాయతీ ఎన్నికలు జరగడం ఇది తొలిసారి కాకపోయినా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారశైలి కారణంగా ప్రత్యేకతను, […]
గ్రామ పరిపాలనలో భాగస్వాములయ్యే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని యువత కోల్పోయింది. 2019 ఓటర్ల జాబితా ప్రకారం జరుపుతున్న ఎన్నికల వల్ల 3.60 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతున్నారని, 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ల వాదనతో విభేధించిన హైకోర్టు.. ఈ దశలో పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోబోమని చెబుతూ.. దాఖలైన రెండు పిటిషన్లను తోసిపుచ్చింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర […]
పంచాయతీ ఎన్నికల అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్ల పేరుతో జిల్లాల్లో పర్యటిస్తూ నిమ్మగడ్డ చేస్తున్న వ్యాఖ్యలకు, టీడీపీ పార్టీ కార్యాలయంలో కూర్చుని చంద్రబాబు మాట్లాడుతున్న మాటలకు పెద్ద వ్యత్యాసం కనిపించడం లేదు. ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదంటూనే.. ఏకగ్రీవాలు మనకు అవసరం లేదని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అధికారులకు చెబుతున్నారు. ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగితే అది అధికారుల వైఫల్యమేనంటూ కొత్త భాస్యం చెబుతున్నారు. నాయకత్వం […]
ఏపీలో యాప్ లో పంచాయతీ మొదలైంది. అటు ఏపీఎస్ఈసీ, ఇటు ఏపీ సర్కార్ పోటా పోటీగా యాప్ లను తయారు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకొచ్చిన కొత్త ప్రైవేట్ యాప్ తాజాగా ఏపీ సర్కార్, ఏపీఎస్ఈసీకి మధ్య కొత్త వివాదానికి తెరతీసింది. ఎస్ఈసీ కి కౌంటర్ గా వైసీపీ ఈ-నేత్రం పేరుతో యాప్ ను అందుబాటులో కి తీసుకుని వచ్చింది. పరిస్థితి […]
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా జరగబోతున్నాయా..? గత ఎన్నికల్లో అసాధారణ పరిస్థితుల మధ్య ఎక్కడో ఒక చోట రీ పోలింగ్ జరగ్గా.. తాజా పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ చోట్ల రీపోలింగ్ జరగబోతోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు ఇ–వాచ్ యాప్ ను ఆవిష్కరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు పై అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఇ–వాచ్ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని, తీవ్రమైన ఫిర్యాదులపై […]
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్లు వేసేలా ఎందుకు ఏర్పాట్లు చేయలేదు..? నా వద్దకు వచ్చి వివరణ ఇవ్వండి… ఇదీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహారశైలిలో చోటు చేసుకున్న తాజా పరిణామం. ప్రతిపక్ష పార్టీలు ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు అవకాశం ఇవ్వాలని కోరగానే.. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలిచ్చేశారు. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్లైన్లో కూడా నామినేషన్లు దాఖలుకు ఏర్పాట్లు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతిపక్షాలు అడగడమే తరువాయి […]