iDreamPost

కోడి ఈకలతో వీళ్ళు చేసేది తెలిస్తే.. కోట్లు సంపాదించడం అంత ఈజీనా అనుకుంటారు!

మనకి తెలిసింది దురద పుడితే చెవిలో కోడి ఈక పెట్టి తిప్పడమే. కానీ వీళ్ళు అదే కోడి ఈకతో కోట్లు సంపాదించేస్తున్నారు. అసలు కోడి ఈక ఎందుకూ పనికిరాదనుకుంటాం. కానీ వీళ్ళు చేసే పని తెలిస్తే అంత ఉపయోగం ఉందా? దానికి అంత డిమాండ్ ఉందా? వాటితో అంత డబ్బు సంపాదించవచ్చా? అని ఆశ్చర్యపోతారు.

మనకి తెలిసింది దురద పుడితే చెవిలో కోడి ఈక పెట్టి తిప్పడమే. కానీ వీళ్ళు అదే కోడి ఈకతో కోట్లు సంపాదించేస్తున్నారు. అసలు కోడి ఈక ఎందుకూ పనికిరాదనుకుంటాం. కానీ వీళ్ళు చేసే పని తెలిస్తే అంత ఉపయోగం ఉందా? దానికి అంత డిమాండ్ ఉందా? వాటితో అంత డబ్బు సంపాదించవచ్చా? అని ఆశ్చర్యపోతారు.

కోడి ఈకలతో వీళ్ళు చేసేది తెలిస్తే.. కోట్లు సంపాదించడం అంత ఈజీనా అనుకుంటారు!

ఈ సృష్టిలో పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు, ఉండదు. ప్రతీదీ పనికొచ్చేదే. వేస్ట్ అని పారేసే వ్యర్థాలతో కూడా మనిషికి పనికొచ్చే వస్తువులను తయారు చేస్తున్నారు. టెక్నాలజీని వాడుకుని మురికి నీటిని సైతం ఫిల్టర్ చేసి తాగునీటిగా మారుస్తున్నారు. ఆలోచన ఉండాలే గానీ ఏదైనా సాధించవచ్చు. మనిషి తల వెంట్రుకలతోనే కాదు, కోడి వెంట్రుకలతో కూడా వ్యాపారం చేయవచ్చునని ఈ జంట నిరూపించింది. అది కూడా వందలు, వేలు కాదు.. ఏకంగా కోట్లు సంపాదించవచ్చునని ప్రూవ్ చేసింది. కోడి ఈకలతో బిజినెస్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అందులోనే ఉంది మెలికంత. పొలాల్లో ఎరువుగా వాడే కోడి పెంట వల్ల ఎలా అయితే ఉపయోగం ఉందో అలానే ఈ ఈ కోడి ఈకల వల్ల కూడా బోలెడంత లాభం ఉంది. 

అలా పుట్టింది ఆలోచన:

రాజస్థాన్ లోనిజైపూర్ కి చెందిన ముదిత, రాధేష్ దంపతులు.. పెళ్లి కాక ముందు నుంచే స్నేహితులు. కలిసే చదువుకున్నారు. జైపూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ లో ఇద్దరూ ఎంఏ చేశారు. ఆ సమయంలోనే వ్యర్థ పదార్థాలతో పనికొచ్చే వస్తువులను తయారు చేసే ప్రాజెక్టు ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యారు. రాధేష్.. తమ జీవితాన్ని మలుపు తిప్పే సరికొత్త ప్రాజెక్ట్ కోసం ఆలోచిస్తున్నారు. ఓ చికెన్ షాప్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ.. కోడి ఈకను చేతితో తాకాడు. అలా తాకగానే రాధేష్ మైండ్ లోంచి ఒక ఆలోచన పుట్టింది. కోడి ఈకలతో బట్టలు తయారుచేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన పుట్టింది. ఆ విషయాన్ని స్నేహితురాలు ముదితకి చెప్పడంతో ఆమె ఇంప్రెస్ అయ్యారు. ఇద్దరూ కలిసి ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టారు.

కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు, అవమానాలు:

అయితే ఈ ప్రాజెక్ట్ కోసం వీరిద్దరూ చాలా కష్టపడ్డారు. నిజానికి రాధేష్ కుటుంబ సభ్యులు ప్యూర్ వెజిటేరియన్స్ కావడంతో ఈ వ్యాపారం పెడతామంటే ఒప్పుకోలేదు. ఎలాంటి ఆర్థిక సహకారం కూడా అందించలేదు. ఆ టైంలో రాధేష్, ముదిత జంట ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా వెనక్కి తగ్గలేదు. తమ కలల ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వీరి ప్రాజెక్ట్ ని ఇది ఒక ప్రాజెక్ట్ ఆ? అని చాలా మంది ఎగతాళి చేశారు. ఇది వర్కవుట్ అయ్యే పని కాదు, టైం వేస్టు అంటూ అవమానించారు. ఎవరెన్ని మాటలు అన్నా కూడా వెనకడుగు వేయలేదు. అలా 2010లో స్టార్ట్ అయిన వీరి కలల ప్రాజెక్ట్.. 8 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2018లో పురుడు పోసుకుంది. 8 ఏళ్ల నిరీక్షణ ఫలితమే కోట్ల టర్నోవర్ బిజినెస్.

ఈ ప్రాజెక్ట్ కోసం ఈ జంట చాలా కష్టపడ్డారు. ఎందుకంటే వీరి ఐడియా ఇంతవరకూ ఎక్కడా ఎవరూ అమలు చేయలేదు. ఈ వ్యాపారం ఎవరూ చేసిన దాఖలాలు లేవు. కోడి ఈకలతో బట్టలు ఎలా తయారు చేయాలో అన్న సమాచారం కూడా దొరకలేదు. చాలా పరిశోధన చేసి ఫైనల్ గా కోడి ఈకల్ని దుస్తులుగా మార్చే టెక్నిక్ ని కనిపెట్టారు. అయితే తయారు చేయడం ఓకే కానీ దాన్ని అమ్మడం అనేది వాళ్ళ ముందున్న సవాల్. కోడి ఈకలతో తయారు చేసిన దుస్తుల్ని మనవాళ్ళుకొనరు. మరెలా అని ఆలోచిస్తున్న టైంలో.. విదేశాల్లో వీటికి డిమాండ్ ఉందని తెలుసుకున్నారు. కోడి ఈకలతో చేసిన శాలువాలకి అక్కడ డిమాండ్ ఎక్కువని తెలుసుకుని.. విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు. అలా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఏటా కోట్లు సంపాదిస్తున్నారు. 

3 లక్షలకు పైగా గిరిజన మహిళలకు ఉపాధి:

అలా చిన్న కుటీర పరిశ్రమగా మొదలైన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు ఒక పెద్ద పరిశ్రమగా ఎదిగింది. ముదిత అండ్ రాధేష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో పెద్ద బిజినెస్ నే రన్ చేస్తున్నారు. ‘ఉమెన్ ఆన్ వింగ్స్’ పేరుతో గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇప్పటి వరకూ 3,33,400 మంది మహిళలకు స్థిరమైన ఉద్యోగాలను కల్పించారు. గిరిజన కుటుంబాలకు చెందిన పది లక్షల మంది పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. మరి కోడి ఈకలతో కోట్లు సంపాదిస్తూ.. లక్షల మందికి ఉపాధి కల్పించిన ఈ జంటపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి