iDreamPost

సామాన్యుడిగా ఫెవికాల్ యాడ్‌లో నటించి.. తరువాత రాజమౌళి కన్నా తోపు డైరెక్టర్ అయ్యాడు!

ఏదైనా వస్తువు మార్కెట్ చేయాలంటే.. అడ్వర్టైజ్ మెంట్ చాలా ముఖ్యం. దీని కోసం స్పెషల్ మేకర్స్ ఉన్నారు. దిగ్గజ దర్శకులు, హీరోలు కూడా వర్క్ చేస్తుంటారు. ఇదిగో ఈ ఫెవికాల్ యాడ్‌లో నటించిన ఇతడు ఎవరో తెలుసా..?

ఏదైనా వస్తువు మార్కెట్ చేయాలంటే.. అడ్వర్టైజ్ మెంట్ చాలా ముఖ్యం. దీని కోసం స్పెషల్ మేకర్స్ ఉన్నారు. దిగ్గజ దర్శకులు, హీరోలు కూడా వర్క్ చేస్తుంటారు. ఇదిగో ఈ ఫెవికాల్ యాడ్‌లో నటించిన ఇతడు ఎవరో తెలుసా..?

సామాన్యుడిగా ఫెవికాల్ యాడ్‌లో నటించి.. తరువాత రాజమౌళి కన్నా తోపు డైరెక్టర్ అయ్యాడు!

యాడ్స్ అంటే ఇప్పుడో అవగాహన వచ్చింది కానీ.. టీవీలు వచ్చిన కొత్తలో ప్రకటనలు వస్తుంటే భలే సరదా. వాటిని కూడా మిస్ కాకుండా చూసే వారు పెద్దలు, పిల్లలు. యాడ్ అనే పదం తెలియక.. సుత్తి వస్తుందని అని సంబోధించేవారు. అప్పట్లో కేవలం బాలీవుడ్ నటీనటులు మాత్రమే అడ్వటైజ్ మెంట్స్‌లో కనిపించే వారు. టయ్.. వాషింగ్ పౌడర్ నిర్మా, ఊ.. లాలాలా అంటూ లిరిల్ సోప్ యాడ్. బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అని, ఐ లవ్ యూ రస్నా, ఐయామ్ కాంప్లైన్ బాయ్.. ఐయామ్ కాంప్లైన్ గర్ల్, టీవీల్లో నుండి దెయ్యంలా రెండు కొమ్ములతో భయపెట్టే ఓనిడా టీవీ యాడ్ వరకు ప్రతిదీ అలరించింది. బిస్కెట్, చాక్లెట్స్ నుండి ప్రతి వస్తువును మార్కెట్ చేసుకున్నాయి పలు సంస్థలు.

అందులో ఒకటి.. ఫెవికాల్. ఇదొక గమ్ యాడ్. ‘దమ్మున లాగు హైస్సా, జోరున లాగు హైస్సా’అంటూ సాగిపోతుంది యాడ్. అందులో ఫెవికాల్ ఓ వైపు.. మరో వైపు నలుగురు ఐదుగురితో పాటు ఓ ఏనుగు కూడా తాడు పట్టుకుని లాగుతూ ఉంటుంది. కానీ ఫెవికాల్ ముందు.. ఇటువైపు టీమ్ ఓడిపోతుంది. ఏనుగు కూడా కూలబడిపోతుంది. అందులో ఓ వ్యక్తి అటు వైపు ఉంది ఫెవికాల్ అంటూ దాని సామర్థ్యం గురించి చెబుతుంటాడు. ఇంతకు అతడు ఎవరో తెలుసా..? యాడ్‌లో నటించాడు కదా నటుడు అనుకునేరు.. ఫేమస్ డైరెక్టర్. చెప్పాలంటే.. రాజమౌళి కన్నా తోపు దర్శకుడు. ఒక్క సినిమాతో చరిత్ర తిరగరాయగల దిగ్గజ ఫిల్మ్ మేకర్. ఓటమి ఎరుగని డైరెక్టర్ ఆయన.

ఇంతకు ఎవరు అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే యునిక్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. ఎడిటర్‌గా కెరీర్ స్టార్ చేసి డైరెక్టర్ అయ్యాడు. దర్శకుడిగా చేతిపై వేళ్లతో లెక్కించే సినిమాలు తీసినా.. గుర్తుండిపోయే చిత్రాలు తీశాడు. సందేశాత్మక చిత్రాలను తీయడంలో దిట్ట. ఆలోచింప చేసే విధంగా ఆయన సినిమాలో ఉంటాయి. మున్నాభాయ్ ఎంబీబీఎస్ నుండి ఇటీవల వచ్చిన డంకీ వరకు చూస్తే.. ఇలాంటి ఏదో ఒక సామాజిక అంశాలు ముడిపడి ఉంటాయి. సంజయ్ దత్‌ మూవీ మున్నాభాయ్‌లో చనిపోయిన గాంధీ కనిపిస్తే.. పీకే.. కనిపించని దేవుడిపై చర్చ ఉంటుంది. లగరహో మున్నాభాయ్ తర్వాత ఆయన రూపొందించిన చిత్రం త్రీ ఇడియట్స్.

Rajkumar hirani fevicol ad

ఈ సినిమా ఎంత పెద్ద హిట్లో అందరికీ తెలిసిందే. అమీర్ ఖాన్‌తో మరోసారి తెరకెక్కించిన చిత్రం పీకే. ఇది కూడా మంచి సందేశాత్మక చిత్రమే. ఇక సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సంజు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గత ఏడాది బాలీవుడ్ బాద్ షా షారూఖ్ తో డంకీ చిత్రాన్ని రూపొందించాడు. సలార్-డంకీ పోటాపోటీగా రిలీజయ్యి.. రెండు హిట్స్ అందుకున్నాయి. ఇక హిరానీతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ హీరోలే కాదు.. టాలీవుడ్ యాక్టర్స్ కూడా ఆసక్తి చూపుతుంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి