iDreamPost

PM Modi Biopic: మోడీ జీవితంపై మరో బయోపిక్.. ఈసారి ‘బాహుబలి’ యాక్టర్​తో..!

  • Published May 18, 2024 | 9:34 PMUpdated May 18, 2024 | 9:34 PM

ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా ఇప్పటికే ఓ సినిమా వచ్చింది. ఆయన లైఫ్​పై ఇంకో బయోపిక్ రానుందని తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా ఇప్పటికే ఓ సినిమా వచ్చింది. ఆయన లైఫ్​పై ఇంకో బయోపిక్ రానుందని తెలుస్తోంది.

  • Published May 18, 2024 | 9:34 PMUpdated May 18, 2024 | 9:34 PM
PM Modi Biopic: మోడీ జీవితంపై మరో బయోపిక్.. ఈసారి ‘బాహుబలి’ యాక్టర్​తో..!

సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవితాలపై సినిమాలు తీయడం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ ట్రెండ్ ఈ మధ్య ఎక్కువైంది. ఇలాంటి మూవీస్ వస్తే చూసేందుకు ఆడియెన్స్ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే దర్శక, నిర్మాతలు ప్రముఖుల జీవితాలను సిల్వర్​స్క్రీన్ మీదకు తీసుకొచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ లైఫ్​పై బయోపిక్ రూపొందిన సంగతి తెలిసిందే. ‘పీఎం నరేంద్ర మోడీ’ పేరుతో తెరకెక్కిన ఈ ఫిల్మ్​ను హిందీలో తీశారు. ఒమంగ్ కుమార్ డైరెక్షన్​లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు మోడీ జీవితం మీద మరో బయోపిక్ తీసేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.

మోడీ జీవితం ఆధారంగా పాన్ ఇండియా రేంజ్​లో బిగ్ మూవీ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది తెలియదు గానీ మోడీ పాత్రలో ఎవరు నటించనున్నారనే దాని మీద మాత్రం ఓ పేరు బలంగా వినిపిస్తోంది. మోడీ రోల్​లో ప్రముఖ నటుడు సత్యరాజ్ యాక్ట్ చేయనున్నారని కోలీవుడ్​లో టాక్ నడుస్తోంది. ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రలో అద్భుతంగా నటించి దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు సత్యరాజ్. ముఖ్యంగా తమిళం, తెలుగు నాట ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. మోడీ పాత్రలో సత్యరాజ్​ను తీసుకుంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఆడియెన్స్​కు మూవీని దగ్గర చేయొచ్చని ప్రొడ్యూసర్స్ అనుకుంటున్నారని సమాచారం.

మోడీ బయోపిక్​లో సత్యరాజ్ ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నా.. దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. మేకర్స్ నుంచి గానీ సత్యరాజ్ నుంచి గానీ దీని గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. మూవీ టీమ్ నుంచి అనౌన్స్​మెంట్ వస్తే గానీ ఆయన ఇందులో నటించనున్నారని చెప్పలేం. ఇదిలా ఉంటే.. మోడీ జీవితంపై గతంలో వచ్చిన బయోపిక్​ యావరేజ్​ మూవీగా నిలిచింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సత్యరాజ్​ యాక్ట్ చేస్తారని చెబుతున్న బయోపిక్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. వైవిధ్యమైన నటనతో ఆకట్టుకునే ఈ స్టార్ యాక్టర్ ఆ రోల్​ను ఓన్ చేసుకొని నటిస్తే మాత్రం తిరుగుండదు. మరి.. మోడీ బయోపిక్​లో సత్యరాజ్ నటిస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి