iDreamPost

పంచాయితీ తెగేనా..? నిధులు వచ్చేనా..?

పంచాయితీ తెగేనా..? నిధులు వచ్చేనా..?

స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి నెలాఖరులోపు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు మురిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. 2018 –20లో రెండు ఆర్థిక ఏడాదులకు గాను 14వ ఆర్థిక సంఘం ఏపీలోని పంచాయతీలకు 4065.79 నిధులు కేటాయించింది. ఇందులో తొలివిడతగా 858.99 కోట్లు కేంద్రం రాష్ట్రానికి జమ చేసింది. అయితే పంచాయతీలకు పాలక మండళ్లు లేకపోవడంతో మిగిలిన నిధులను కేంద్రం పెండింగ్‌లో పెట్టింది.

2018 ఆగస్టులోనే పంచాయతీల పాలక మండళ్లకు గడువు ముగిసింది. అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వెంటనే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. 2014 ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేకపోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఏర్పడింది. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రజా వ్యతిరేక వెల్లడవుతుందని భావించిన చంద్రబాబు ఎన్నికలను పక్కనపెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన పని వల్ల పంచాయతీలు భారీ నష్టపోయే పరిస్థితికి వచ్చాయి. మార్చి నెలాఖరు.. అంటే మరో 31 రోజుల్లో పంచాయతీలకు ఎన్నికలకు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి కత్తిమీద సాములాంటిదే.

ఓ పక్క రిజర్వేషన్లపై కోర్టులో వివాదం నలుగుతూనే ఉంది. ఈ రోజు లేదా సోమవారం రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వెలువరిస్తుందన్న భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అసలు సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ లోపునే ఈ వివాదం పరిష్కరించాల్సి ఉండగా.. హైకోర్టు తేల్చలేకపోయింది. ఫలితంగా రోజులు తరిగిపోతున్నాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి దాదాపు 3200 కోట్లు నిధులు వచ్చాయంటే పెద్ద ఊరట లభిస్తుంది. అందుకే ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలదో ఉంది. ఓ వైపు పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాబోతున్న సమయంలో.. వాటికి ఇబ్బంది లేకుండానే ఎన్నికలు నిర్వహించడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

రిజర్వేషన్‌పై కోర్టు తీర్పు వెలువరిస్తే.. మారుక్షణమే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఎలా ఉన్నా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పిన విషయం తెలిసిందే. తొలుత పార్టీ గుర్తులపై జరిగే మండల, జిల్లా పరిషత్‌ ఆ తర్వాత పంచాయతీ, వార్డుల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి