iDreamPost

‘అరుంధతి’లో ఆ పాటకు సాయి పల్లవి డ్యాన్స్! ఈ రేర్ వీడియో వెనుక ఓ కథ ఉంది!

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటి అరుంధతి. ఈ మూవీ అనుష్కకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పశుపతిని అంతమొందించే సీన్.. ఈ సినిమాకే హైలెట్. అందులో ఓ స్పెషల్ డ్యాన్సుతో విలన్ సోనూ సూద్ ని చంపేస్తుంది స్వీటీ. ఇప్పుడు ఇదే పాటకు

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటి అరుంధతి. ఈ మూవీ అనుష్కకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పశుపతిని అంతమొందించే సీన్.. ఈ సినిమాకే హైలెట్. అందులో ఓ స్పెషల్ డ్యాన్సుతో విలన్ సోనూ సూద్ ని చంపేస్తుంది స్వీటీ. ఇప్పుడు ఇదే పాటకు

‘అరుంధతి’లో ఆ పాటకు సాయి పల్లవి డ్యాన్స్! ఈ రేర్ వీడియో వెనుక ఓ కథ ఉంది!

అందం, అభినయం, నిండైన రూపం, ఆకర్షణీయమైన కట్టుబొట్టుతో ఆకట్టుకునే అతి కొద్ది మంది టాలీవుడ్ హీరోయిన్లలో అనుష్క ముందు వరుసలో ఉంటుంది. తొలి నాళ్లల్లో గ్లామరస్ పాత్రలు చేసినా.. ఇప్పుడు స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ చేస్తూ సాటి హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తుంది. చాలా నిరాడంబరంగా, డౌన్ టు ఎర్త్‌గా కనిపిస్తూ ఉంటుంది స్వీటీ శెట్టి. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు టాలెంట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. సూపర్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ యోగా టీచర్.. ఆ మూవీలో ఓకే అనిపించుకున్నా.. ఆ తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్స్ చేసింది. మహా నంది, అస్త్రం వంటి సినిమాలు నటిగా నిలబెట్టాయి. ఇక రాజమౌళి-రవితేజ విక్రమార్కుడుతో మంచి పేరు తెచ్చిపెట్టింది.

కానీ ఆమెను లేడీ సూపర్ స్టార్‌గా నిలబెట్టింది మాత్రం అరుంధతి. 2009లో వచ్చిన ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. అప్పటి నుండి తెలుగు వారికి జేజేమ్మగా మారింది అనుష్క శెట్టి. ఇందులో ఆమె కట్టుబొట్టు, నటనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇందులో పశుపతిని అంతం చేసేందుకు అనుష్క ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో వేద పండితులతో అతడికి సమాధి కడుతుంది. శబ్ద భేరీ నృత్యంతో పశుపతిని చంపేస్తుంది. ఇదే పాటకు డ్యాన్స్ క్వీన్ సాయి పల్లవి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. సాయి పల్లవి హీరోయిన్ కాకముందు ఢీ షోలో పార్టిసిపేట్ చేసింది అన్న సంగతి విదితమే. ఢీ 4లో ఓ కంటెస్టెంట్‌గా వచ్చింది. 2013లో ప్రముఖ శాటిలైట్ ఛానల్లో ఇది ప్రసారం అయ్యేది. పది సంవత్సరాల క్రితం సాయి పల్లవి.. ఆ పాటకు డ్యాన్స్ ఇరగదీసింది.

అనుష్క ఆ పాటలో ఓకే కానీ.. ఇక్కడ లైవ్ షోలో ఆమెను మించిపోయే విధంగా ఎక్స్ ప్రెషన్స్‌తో చంపేసింది ఈ లేడీ సూపర్ స్టార్. సాధారణంగా సినిమా అంటే చాలా టేక్స్ ఉంటాయి. స్టెప్పు స్టెప్పుకు బ్రేక్ తీసుకోవచ్చు. కానీ స్టేజ్ మీద ఫెర్ఫామెన్స్ అంటే కంటిన్యూగా చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేసి.. అప్పట్లో ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో తడబడకుండా చేయాలంటే చాలా కష్టం. కానీ పల్లవి.. నెమలిలా నాట్యం చేసింది. ఏ మాత్రం తడబడకుండా చేసి జడ్జెస్ తో వావ్ అనిపించుకుంది. ఆమె ఫెర్మామెన్స్‌కు జడ్జి రంభ సైతం ఫిదా అయిపోయి చప్పట్లతో ప్రశంసించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది తండేల్ మూవీతో పలకరించనుంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. రణబీర్ రామాయణంలో సీతగా కనిపించబోతుంది ఈ క్యూటీ.

 

View this post on Instagram

 

A post shared by SaiPallavi Followers (@saipallavifollowers)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి