iDreamPost

పవన్ అభిమానిపై రేణూ దేశాయ్ ఫైర్.. పవన్ కు అంత ప్రేమ లేదు అంటూ..!

Renu Desai Reply To Pavan Kalyan Fan: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కి పవన్ అభిమానుల నుంచి ఇంకా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి విషయాన్ని తమ అభిమాన హీరోకి లింక్ చేస్తూ నానా యాగి చేస్తున్నారు. తాజాగా ఆ విషయంపై రేణూ దేశాయ్ రియాక్ట్ అయ్యింది.

Renu Desai Reply To Pavan Kalyan Fan: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కి పవన్ అభిమానుల నుంచి ఇంకా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి విషయాన్ని తమ అభిమాన హీరోకి లింక్ చేస్తూ నానా యాగి చేస్తున్నారు. తాజాగా ఆ విషయంపై రేణూ దేశాయ్ రియాక్ట్ అయ్యింది.

పవన్ అభిమానిపై రేణూ దేశాయ్ ఫైర్.. పవన్ కు అంత ప్రేమ లేదు అంటూ..!

సాధారణంగా సినిమా హీరోలకు అభిమానులు ఉంటారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫ్యానిజం అనేది కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే అది హద్దుల్లో ఉంటే బాగానే ఉంటుంది. కానీ, హద్దులు దాటి ఇష్టారీతిన ప్రవర్తిస్తేనే లేనిపోని చిక్కులు, అవతలి వాళ్లకు చికాకులు వస్తాయి. ఈ కేటగిరీకి చెందేది ఎవరి అభిమానులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అభిమానం పేరుతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తూ ఉంటారు. అవతలి వాళ్ల జీవితాల్లోకి తొంగి చూసి అపాహాస్యం చేస్తుంటారు. ఈ తరహా ప్రవర్తన ముఖ్యంగా పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ విషయంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు వారికి వార్నింగ్ ఇచ్చిన రేణూ దేశాయ్.. తాజాగా మరో పవన్ అభిమానికి గడ్డి పెట్టింది.

దంపతులుగా రేణు దేశాయ్- పవన్ కల్యాణ్ విడిపోయి వారి జీవితాలను వాళ్లు జీవిస్తున్నారు. కానీ, అభిమానం పేరుతో ఇప్పటికీ రేణూ దేశాయ్ కి పవన్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ఆవిడ ఏ పోస్ట్ పెట్టినా కామెంట్ సెక్షన్స్ లో నెగిటివ్ కామెంట్స్ తో విసిగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే తాను చాలా మంది అకౌంట్స్ ని బ్లాక్ చేశానంటూ స్వయంగా రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇప్పటికే పలుమార్లు పవన్ కల్యాణ్ తో పోలికలు, తాను చేసిన పనికి క్రెడిట్ ని పవన్ కల్యాణ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ నేరుగా చెప్పారు. కానీ, ఇంకా కొందరు తమ కామెంట్స్ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఆ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. తాను చేసిన ఈ కామెంట్ కోపంతో కాదని.. తాను ఎంతో బాధతో పెడుతున్నాని వివరణ కూడా ఇచ్చారు. ఇన్నేళ్లుగా తాను ఏ పని చేసినా ఆ విషయాన్ని తన మాజీ భర్తకు లింక్ చేయడమో.. అతనికి క్రెడిట్ ఇవ్వడమో చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగింది అంటే.. ఇటీవల రేణూ దేశాయ్ పలు యానిమల్ ఎన్జీఓవలకు సహాయం చేసింది. తాజాగా ఒక అభిమాని ఆ విషయానికి “మా పవన్ కల్యాణ్ అన్నయ్యలాగా గోల్డెన్ హార్ట్ వాళ్లది” అంటూ కామెంట్ చేశారు. దానికి రేణూ దేశాయ్ తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేసింది.

Renu desai about pawan kalyan

“ప్రతిసారి నేను పెట్టే పోస్టులకు ఎందుకు నా మాజీ భర్తతో పోలుస్తున్నారు. ఇలాంటి వాళ్లను నేను ఇప్పటికే బ్లాక్ చేశాను. నేను నా పదేళ్ల వయసు నుంచే నేను జంతు సంరక్షణ కోసం ఎన్నో పనులు చేశాను. అంత ప్రేమ, వాత్సల్యం ఆయనకు లేవు” అంటూ రేణూ దేశాయ్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. చాలామంది పవన్ అభిమానులకు ఇకనైనా ఇలాంటి ప్రవర్తన మానుకోవాలని హితవు పలుకుతున్నారు. మరి.. రేణూదేశాయ్– పవన్ కల్యాణ్ అభిమాని మధ్య జరిగిన ఈ సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి