‘ఆచార్య’ ఫలితంతో దర్శకుడు కొరటాల శివ పట్ల మెగాస్టార్ చిరంజీవి చాలా అసహనంగా ఉన్నాడనే ప్రచారం జరిగింది. చిరంజీవి సైతం ఆచార్య రిజల్ట్ తర్వాత దర్శకులు అలా ఉండాలి, ఇలా ఉండాలంటూ పలు సందర్భాల్లో చేసిన కామెంట్స్ పరోక్షంగా కొరటాలనే అన్నట్లుగా ఉండటంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఒక వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదేంటంటే కొరటాల కొత్త సినిమా లాంచ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారట. […]
అతిలోకసుందరిగా శ్రీదేవికున్న ఫాలోయింగ్ ఆవిడ స్వర్గానికి వెళ్లపోయినా నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్స్ రూపంలో ఇంకా అలాగే కొనసాగుతోంది. ఆ లెగసిని పెద్ద కూతురు జాన్వీ కపూర్ కొనసాగిస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చారు. సినిమాలైతే వరసగా చేస్తోంది కానీ తల్లి సంపాదించుకున్న స్థాయిలో ఇంకా సగం కూడా అందుకోలేదు కానీ డిమాండ్ల విషయంలో మాత్రం చాలా పట్టుదలగా ఉందని బాలీవుడ్ టాక్. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీలో […]
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని పట్టాలెక్కించకుండా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. మరోవైపు తనతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటించిన రామ్ చరణ్ ఇప్పటికే ‘ఆచార్య’తో ప్రేక్షకులను పలకరించాడు. అలాగే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ని సగానికి పైగా పూర్తి చేశాడు. ఎన్టీఆర్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ వచ్చి ఎనిమిది నెలలు దాటినా కొత్త సినిమాకి టెంకాయ కొట్టలేదు. రెస్ట్, ఫ్యామిలీ టూర్స్ అంటూ […]
నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ప్రకటించిన కొరటాల శివ సినిమాకు హీరోయిన్ ని సెట్ చేయడం పెద్ద సవాల్ గా మారుతోంది. ప్యాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో తప్పనిసరిగా బాలీవుడ్ బ్యూటీనే తీసుకోవాలి. ముందు అలియా భట్ ఓకే చెప్పి తర్వాత తప్పుకుంది. కావాలని చేయకపోయినా కాల్ షీట్స్ సమస్య వల్ల డేట్ల సర్దుబాటు కాలేదు. ప్రభాస్ తో ప్రాజెక్టు కె చేస్తున్న దీపికా పదుకునేతో కూడా ఇదే ప్రాబ్లమ్. ఏదో ట్రై చేశారు […]
నిన్న సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపొందబోయే సినిమా తాలూకు అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో గట్టిగా వెళ్ళింది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చడం పట్ల ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. దానికి తోడు ఈ వీడియోలో ఇచ్చిన బీజీఎమ్ అప్పుడే వైరల్ అవుతోంది. రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్ ఛాయాగ్రహణం అందించడం, సాబు సిరిల్ ని ఎంపిక చేసుకోవడం ప్రాజెక్ట్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఎంత గొప్ప విజయం సాధించినా అది […]