iDreamPost
android-app
ios-app

జాన్వీకపూర్ ప్రాక్టికల్ గా ఆలోచించాలి

  • Published Jan 05, 2023 | 5:06 PM Updated Updated Jan 05, 2023 | 5:06 PM
  • Published Jan 05, 2023 | 5:06 PMUpdated Jan 05, 2023 | 5:06 PM
జాన్వీకపూర్ ప్రాక్టికల్ గా ఆలోచించాలి

అతిలోకసుందరిగా శ్రీదేవికున్న ఫాలోయింగ్ ఆవిడ స్వర్గానికి వెళ్లపోయినా నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్స్ రూపంలో ఇంకా అలాగే కొనసాగుతోంది. ఆ లెగసిని పెద్ద కూతురు జాన్వీ కపూర్ కొనసాగిస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చారు. సినిమాలైతే వరసగా చేస్తోంది కానీ తల్లి సంపాదించుకున్న స్థాయిలో ఇంకా సగం కూడా అందుకోలేదు కానీ డిమాండ్ల విషయంలో మాత్రం చాలా పట్టుదలగా ఉందని బాలీవుడ్ టాక్. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీలో హీరోయిన్ తీసుకోవడం దాదాపు ఖరారే కానీ స్క్రిప్ట్ మొత్తం తనకు వినిపించి ఖచ్చితంగా ఎలాంటి ఎడిటింగ్లు ఉండకూడదని కండీషన్ పెడుతోందట

ఇదొక్కటే కాదు తను రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువగా అడిగినట్టు సమాచారం. అన్నింటికి ఒప్పుకున్నా అసలు సంబంధం లేని ఎడిటింగ్ వ్యవహారాల గురించి లింక్ పెట్టడం పట్ల కొరటాల అసహనంగా ఉన్నట్టు తెలిసింది. జాన్వీతో సౌత్ డెబ్యూ చేయించడం కోసం తండ్రి నిర్మాత బోనీ కపూర్ ఇంత కాలం ఎదురు చూస్తూ వచ్చాడు. హిందీలో ముందు టాప్ స్టార్ ని చేసి ఆ తర్వాత లాంచ్ చేయాలనే ఆలోచన చేశారు కానీ అది జరగలేదు. ఎక్కువ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న జాన్వీ ఇటీవలే మిలితో ప్రేక్షకులను పలకరించింది. కానీ సినిమా ఫ్లాప్. ఒరిజినల్ వెర్షన్ హెలెన్ కు దరిదాపుల్లోకి వెళ్లలేక తుస్సుమంది

అయినా జాన్వీ కపూర్ లాంటి వాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది. దాని వాడుకునే దిశగా వచ్చిన అవకాశాలు ఒడిసి పట్టేసుకోవాలే తప్పించి ఇలా బెట్టు చేస్తే ఆశలుకే మోసం వస్తుంది. తారక్ లాంటి స్టార్ తో చేసే ఛాన్స్ రావడం వినియోగించుకుంటే అది కనక బ్లాక్ బస్టర్ అయితే తర్వాత స్టార్లందరూ పిలుస్తారు. పూజా హెగ్డే, రష్మిక మందన్న, శ్రీలీల లాంటి వాళ్ళు ఎదిగింది అలాగే కదా. జగదేకవీరుడు అతిలోకసుందరి 2 ని తీయాలని నిర్మాత అశ్వినీదత్ ఎప్పటి నుంచో ప్లానింగ్ లో ఉన్నారు. ఒకవేళ కథ కనక ఓకే అయితే రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ జట్టు కట్టొచ్చు. కాకపోతే దానికెంత టైం పడుతుందో ఇప్పుడే చెప్పలేం

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetlist girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş