iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్ 30 వెనుక అసలు ట్విస్టు

  • Published May 20, 2022 | 11:21 AM Updated Updated May 20, 2022 | 11:21 AM
  • Published May 20, 2022 | 11:21 AMUpdated May 20, 2022 | 11:21 AM
ఎన్టీఆర్ 30 వెనుక అసలు ట్విస్టు

నిన్న సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపొందబోయే సినిమా తాలూకు అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో గట్టిగా వెళ్ళింది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చడం పట్ల ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. దానికి తోడు ఈ వీడియోలో ఇచ్చిన బీజీఎమ్ అప్పుడే వైరల్ అవుతోంది. రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్ ఛాయాగ్రహణం అందించడం, సాబు సిరిల్ ని ఎంపిక చేసుకోవడం ప్రాజెక్ట్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఎంత గొప్ప విజయం సాధించినా అది రామ్ చరణ్ తో పంచుకున్నది కావడంతో తారక్ ఫ్యాన్స్ మరో సోలో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఇంత హైప్.

ఇక్కడే ఓ ట్విస్టు ఉంది. బ్యాక్ డ్రాప్, ఎన్టీఆర్ చేతిలో కత్తులు, సముద్రం పడవ అలలు ఈ సెటప్ మొత్తం చూస్తుంటే ఆ మధ్య అల్లు అర్జున్ తో అధికారికంగా ప్రకటించి డ్రాప్ అయిన సినిమా పోస్టరే గుర్తుకు వస్తోంది. అంటే అప్పుడు బన్నీ వద్దనుకున్నదే ఇప్పుడు తారక్ చేస్తున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీనికి సమాధానం వాళ్ళ ముగ్గురికే తెలుసు కాబట్టి ఇది నిజమో కాదో చెప్పలేం.

రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ వేట ఇంకా కొనసాగుతోంది. అలియా భట్ ని అడిగారు సాధ్యపడలేదు. దీపికా పదుకునేని ట్రై చేస్తున్నారు కానీ ఎంత మేరకు డేట్స్ దొరుకుతాయో తెలియదు.

ఆచార్య తాలూకు గాయం నుంచి బయట పడాలంటే కొరటాల శివ దీంతో గట్టిగా హిట్టు కొట్టాల్సి ఉంటుంది. తన కెరీర్ లో మొదటిసారి తీవ్ర విమర్శలకు గురైన తనకు ఆచార్య కనీసం యావరేజ్ అయినా ఊరట దక్కేది. అదీ జరగలేదు దీంతో ఇప్పుడు చేస్తున్న ఎన్టీఆర్ 30కి స్క్రిప్ట్ పరంగా చాలా కసరత్తులు చేశారట. అందులోనూ అరవింద సమేత వీర రాఘవ తర్వాత నాలుగేళ్లకు పైగా గ్యాప్ తో వస్తున్న తారక్ సోలో హీరో మూవీ ఇదే అవుతుంది. అందుకే అంచనాలు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. ఇవాళ తన పుట్టినరోజు కావడంతో ప్రశాంత్ నీల్ తో చేయబోయే ప్రాజెక్టు తాలూకు అనౌన్స్ మెంట్ కూడా మరికాసేపట్లో రాబోతోంది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio