iDreamPost
android-app
ios-app

NTR 30 – హీరోయిన్ కావలెను

  • Published May 21, 2022 | 3:29 PM Updated Updated May 21, 2022 | 3:29 PM
  • Published May 21, 2022 | 3:29 PMUpdated May 21, 2022 | 3:29 PM
NTR 30 – హీరోయిన్ కావలెను

నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ప్రకటించిన కొరటాల శివ సినిమాకు హీరోయిన్ ని సెట్ చేయడం పెద్ద సవాల్ గా మారుతోంది. ప్యాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో తప్పనిసరిగా బాలీవుడ్ బ్యూటీనే తీసుకోవాలి. ముందు అలియా భట్ ఓకే చెప్పి తర్వాత తప్పుకుంది. కావాలని చేయకపోయినా కాల్ షీట్స్ సమస్య వల్ల డేట్ల సర్దుబాటు కాలేదు. ప్రభాస్ తో ప్రాజెక్టు కె చేస్తున్న దీపికా పదుకునేతో కూడా ఇదే ప్రాబ్లమ్. ఏదో ట్రై చేశారు కానీ తను కూడా నో చెప్పిందని ముంబై టాక్. కియారా అద్వానీకి ఆల్రెడీ చేతి నిండా కమిట్ మెంట్స్ ఉన్నాయి. నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అయ్యేదాకా నో ఆఫర్స్ అంటోందట.

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని ట్రై చేద్దామంటే బొనీ కపూర్ అసలు సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపించడం లేదు. పోనీ పూజా హెగ్డేని తీసుకుందామా అంటే ఆల్రెడీ అరవింద్ సమేత వీర రాఘవలో చేసేసింది కాబట్టి కాంబో రిపీట్ చేసే ఉద్దేశంలో తారక్ లేడు. రష్మిక మందన్నని ఆప్షన్ గా చూద్దామంటే పుష్ప పార్ట్ 2 కోసం తను ఇప్పటికిప్పుడు ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉంది. మెహ్రీన్ లాంటి వాళ్ళను తీసుకుంటే అప్పీల్ తక్కువగా ఉంటుంది. దిశా పటాని కూడా సరైన ఛాయస్ గా అనిపించడం లేవు. ఇప్పుడీ చిక్కుముడిని కొరటాల ఎలా విప్పుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కొత్తమ్మాయిని చూడాలన్నా అంత టైం లేదు.

ఎంత లేదన్నా జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తారక్ కు ఆర్ఆర్ఆర్ పూర్తయ్యాక సంవత్సరం పైగా గ్యాప్ వచ్చింది. ప్రశాంత్ నీల్ అక్కడ సలార్ పూర్తి చేసేలోగా ఇక్కడ జూనియర్ మూవీని రిలీజ్ కి రెడీ చేయాలి. వచ్చే సంక్రాంతికి కాకపోవచ్చు కానీ 2023 వేసవికి రిలీజ్ ప్లానింగ్ జరుగుతోంది. ఎక్కువ సందేశాలు లేకుండా యాక్షన్ డ్రామాతో ఫుల్ మాస్ సబ్జెక్టులో ఎన్టీఆర్ ని చూపించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అనిరుద్ రవిచందర్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ అన్నీ పర్ఫెక్ట్ గా కుదురుతున్న ఈ మూవీకి ఒక్క హీరోయిన్ సెట్ అయిపోతే టెన్షన్ ఉండదు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş