(పదేళ్ల ప్రాయం నుంచే చిరంజీవికి అభిమానిగా మారిన ఓ ఫ్యాన్ మనోగతానికి అక్షరరూపం) మా అమ్మ అంటూ ఉండేది “ఏంట్రా ఈ సినిమా పిచ్చి. తిండి పెడతాయా, ఉద్యోగాలిస్తాయా. అయినా ఆ హీరో అంటే అంత వెర్రి అయితే ఎలారా. ఇట్టా మీ కుర్రాళ్ళంతా హీరోల వెంటపడతారు కాబట్టే భవిష్యత్తులో ఏమవుతారో అని భయంగా ఉంది. ఎప్పుడు మారతారో ఎంటో” నా మనసులో నాకు మాత్రమే వినిపించేది “అమ్మా, నువ్వు నా మీద ప్రేమతో తిట్టే ఆ […]
మాయాబజార్. ఈ పేరులోనే ఒక మేజిక్ ఉంది. దశాబ్దాలు దాటినా, తెలుగు సినిమా ఎన్ని కొత్త పుంతలు తొక్కినా స్క్రీన్ ప్లే గ్రామర్ కు తిరుగు లేని ఉదాహరణగా ఇప్పటి తరం ఫిలిం మేకర్స్ సైతం గర్వంగా చెప్పుకునే పేరిది. ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ఛానల్ మార్చకుండా అలా చూస్తుండి పోయేలా చేయడం దర్శకులు కెవి రెడ్డి ఇంద్రజాలమే. దిగ్గజాలైన నటులున్నప్పటికీ కేవలం పాత్రలు మాత్రమే కనిపించేలా చేయడం ఆయనకే చెల్లింది. అయితే ఇంతలా చరిత్రలో సువర్ణాధ్యాయం […]
రాజేంద్రప్రసాద్ మనకు నవ్వులరాజు గానే సుపరిచితం.మనసు కాస్త కలత పడినప్పుడు ఆహ్లాదకరమైన హాస్య చిత్రాలు చూడాలంటే రాజేంద్రుడి సినిమాలే చక్కని టానిక్.ఈ మాట మనమే కాదు సాక్షాత్తు మాజీ ప్రధానమంత్రి పి. వి.నరసింహరావు గారు కూడా ఒక సందర్భంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకు ఉదాహరణగా చెప్పడానికి అలిసిపోయేటన్ని ఉన్నాయ్ మరి. కాని నటకిరీటీ హాస్య ప్రధాన పాత్రలే కాకుండా విభిన్నమైన కోణాలు కలిగి నటుడిగా ఆయనకు ఛాలెంజ్ విసిరిన పాత్రలు కూడా ఎన్నో చేశారు. వాటిలో మేలిముత్యాలు […]
అందరు దర్శకులు ప్రయోగాలు చేయరు. దానికి నిజంగానే గట్స్ కావాలి. కమర్షియల్ ఫార్ములాకి అలవాటు పడిపోయి అందులో విజయాలను చవిచూడటం మొదలెట్టాక వేరేవాటి వైపు రిస్క్ చేయాలి అనిపించదు. కానీ కొందరు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తారు. అలాంటి వారిలో సింగీతం శ్రీనివాసరావుగారి గురించి ప్రత్యేకంగా చెప్పొచ్చు. ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్ లాంటి మాస్ హిట్స్ తో బాలకృష్ణ మంచి ఊపు మీదున్న టైంలో ఆయన చేసిన ఆదిత్య 369 ఇప్పటికీ ఓ విజువల్ వండర్. […]
కమర్షియల్ సూత్రాలకు కట్టుబడకుండా తాము నమ్మిన పంథాలో గొప్ప చిత్రాలు తీసే దర్శకులను వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. అందులో ముందువరసలో ఉండే వ్యక్తి కళాతపస్వి కె విశ్వనాథ్(K Vishwanath). ఆరు పాటలు నాలుగు ఫైట్లు రాజ్యమేలుతున్న కాలంలో ముసలివాడిని హీరోగా పెట్టి సంగీత భరిత కళాఖండం శంకరాభరణం తీసి పండిత పామరులను ఏకాకాలంలో మెప్పించడం ఆయనకే చెల్లింది. స్టార్లు సైతం నివ్వెరపోయే ఆ విజయం టాలీవుడ్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. అయితే స్టార్ హీరోతో కళాత్మక సినిమా […]
వెంకీ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు, ఒంటరి పోరాటం తర్వాత హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనదగ్గరకు వచ్చిన ప్రతిపాదనకు పచ్చజెండా ఊపేశారు. ఆ టైంలో కూలీ అంటే అందరికీ గుర్తొచ్చేది అమితాబ్ బచ్చనే. సో కేవలం పేరుతోనే అంచనాలు మొదలవుతాయి కాబట్టి కథ విషయంలో సురేష్ బాబు పలు దఫాలు చర్చలు జరిపి కూలీ నెంబర్ 1 ఫైనల్ వెర్షన్ ఒక కొలిక్కి వచ్చేదాకా బాగా శ్రమపడ్డారు. ఒళ్ళంతా పొగరు నిండిన […]
సరిగ్గా ఇదే రోజు పాతికేళ్ల క్రితం రిలీజైన ప్రేమించుకుందాం రా ఇప్పుడు చూసినా అంతే ఫ్రెష్ గా ట్రెండ్ సెట్టర్ గా అనిపిస్తుంది. అందుకే వెంకటేష్ ఫ్యాన్స్ కే కాదు టీవీలో వచ్చిన ప్రతిసారి, యుట్యూబ్ లో చూసిన ఎన్నోసార్లు కొత్త అనుభూతిని ఇస్తూనే ఉంటుంది. దీని వెనకున్న ప్రత్యేక విశేషాలు చూద్దాం. 1993లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న జయంత్ సి పరాన్జీకి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చేందుకు సురేష్ బాబు మాటిచ్చారు. అందులో […]
1995. ఎన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణ మంచి పీక్స్ ని చూస్తున్నారు. ఒకపక్క లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్ లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తో మాస్ ని ఆకట్టుకుంటూనే ‘ఆదిత్య 369’ లాంటి ప్రయోగాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. అంతకు ముందు ఏడాది శంకర్ ప్రభుదేవా కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రేమికుడు’ సౌత్ మొత్తాన్ని సంచలనంతో ఊపుతుంటే అదే రోజు రిలీజైన ‘బొబ్బిలి సింహం’తో మంచి విజయం అందుకోవడం బాలయ్యకే చెల్లింది. అయితే మధ్యలో […]
కంటెంట్ ఉంటేనే సినిమాకు ప్రేక్షకులు పట్టం కడతారనే సత్యం ఇప్పుడే కాదు దశాబ్దాలుగా ఋజువవుతున్నదే. చిన్న హీరో ఉన్నాడా లేక స్టార్ హీరోదా అనే లెక్కలు ఉండవు. నచ్చితే సూపర్ హిట్ చేయండి లేకపోతే టపా కట్టించి ఇంటికి పంపడం. ఓసారి ఇరవై ఏళ్ళు వెనక్కు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి 2002 నాటి ముచ్చట్లు చూద్దాం. అక్టోబర్ నెల. అప్పటికి బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ చివరి వారంలో వచ్చిన చెన్నకేశవరెడ్డి ఒకటే స్ట్రాంగ్ గా ఉంది. […]
1993. భాగ్యరాజ్ మంచి పీక్స్ చూస్తున్న సమయం. ఆర్టిస్టుగా కథకుడిగా దర్శకుడిగా మూడు పడవల ప్రయాణాన్ని సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. తెలుగులోనూ నేను మీవాడినే, పోలీస్ బావా లాంటి డబ్బింగ్ చిత్రాలతో మార్కెట్ ఏర్పడింది. ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఉండేది. అప్పుడు తమిళంలో తీసిందే వీట్ల విశేషంగ. తనే హీరోగా ప్రగతి అనే టీవీ ఆర్టిస్టుని హీరోయిన్ గా పరిచయం చేస్తూ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ ప్రగతి […]