Swetha
రంగ స్థల అనుభవం లేకున్నా కూడా ఆమె సినిమా ప్రయత్నాలు ప్రారంభించింది. 1977వ సంవత్సరం దాదాపు 122 మంది అమ్మాయిలు పోటీ కి వచ్చారు. కె. బాలచందర్ తీస్తున్న మరో చరిత్ర సినిమా కోసం..ఇది మద్రాసులో జరిగింది. ఆ పోటీలో ఒక నల్లటి అమ్మాయి ఎంపికైంది. ఆమెపేరే సరిత.
రంగ స్థల అనుభవం లేకున్నా కూడా ఆమె సినిమా ప్రయత్నాలు ప్రారంభించింది. 1977వ సంవత్సరం దాదాపు 122 మంది అమ్మాయిలు పోటీ కి వచ్చారు. కె. బాలచందర్ తీస్తున్న మరో చరిత్ర సినిమా కోసం..ఇది మద్రాసులో జరిగింది. ఆ పోటీలో ఒక నల్లటి అమ్మాయి ఎంపికైంది. ఆమెపేరే సరిత.
Swetha
నటి సరిత ఆమె ఒక అద్భుతం ..ఆమె ఒక నల్ల బంగారం .. ఆమె నటించదు … జీవిస్తుంది .. ఏ పాత్ర అయినా సరే అందులో పరకాయ ప్రవేశం చేస్తుంది. నల్లగ పొట్టిగా ఉంటేనేం.. అవేమి ఆమెకు అడ్డంకులు కాలేదు. గుండ్రటి మోము.. వెడల్పయిన కలువ ల్లాంటి కళ్ళు .. ఆ కళ్ళను చూశామంటే చూపులు వెనక్కు తిప్పుకోవాలంటే కాస్త టైం పడుతుంది. ఆ కళ్ళు ప్రశ్నిస్తాయి.. ఆ కళ్ళు ఎన్నో బాసలు చెపుతాయి… ఆ కళ్ళు ఎన్నో ఊసులాడుతాయి..ముగ్దమనోహరమైన ఆమె రూపం ఒక సారి చూస్తే వెంటాడుతూనే ఉంటుంది. ఒక సారి చూస్తూనే చూపు మరల్చు కోవడానికి సమయం తీసుకునేంత అందం. అందానికి తగ్గ గాత్రం కూడా కలిగి ఉండటం ఆమెది అదృష్టం..తెలుగులో ఎన్నో సినిమాల్లో గుర్తుండి పోయే పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన ఆమె ఎంతో మంది హీరోయిన్ లకు గాత్ర దానం చేసింది. పుట్టిన ఊరు రాజమండ్రి .. చిన్న తనం నుండే కళల పట్ల మక్కువతో సంగీతం నృత్యం నేర్చుకుంది. రంగ స్థల అనుభవం లేకున్నా కూడా ఆమె సినిమా ప్రయత్నాలు ప్రారంభించింది.
1977వ సంవత్సరం దాదాపు 122 మంది అమ్మాయిలు పోటీ కి వచ్చారు. కె. బాలచందర్ తీస్తున్న మరో చరిత్ర సినిమా కోసం..ఇది మద్రాసులో జరిగింది. ఆ పోటీలో ఒక నల్లటి అమ్మాయి ఎంపికైంది. ఆమెపేరే సరిత. ఎన్నికైన మళ్ళీరోజు వైజాగ్ లో షూటింగ్ ప్రారంభమైంది. కె. బాల చందర్ మరో చరిత్ర సినిమా కోసం ఆమెను ఎంచుకున్నారు.. అప్పటికి సరితకు నటన అంటే ఏంటో తెలియదు.. ఎప్పుడు నటించలేదు. సినిమా కు ఎన్నికైన మళ్ళీ రోజే షూటింగ్ కు వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ మొదటి రోజే బిడియంతో దర్శకుడు చెప్పినట్టు నటించలేక పోయింది. అయితే బాల చందర్ నిరుత్సాహ పడలేదు. తనకు తెలుసు ఆ పిల్ల లో ఉండే టాలెంట్ ఏమిటో మళ్ళీ రోజు షూటింగ్ లో సరిత తన లోని ప్రతిభ ఏంటో చూపించింది. ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక చరిత్రగా నిలిచి పోయింది.
ఆమె 1975లో ప్రొద్దుటూరుకు చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఒక ఏడాది తరువాత అతనినుండి విడిపోయింది. ఆ తర్వాత ఆమె 1988 సెప్టెంబర్ 2న మలయాళ నటుడు ముఖేష్‌ను వివాహం చేసుకుంది మరియు వారికి శ్రావణ్ మరియు తేజస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.ప్రస్తుతం అప్పుడప్పుడూ టీవి సీరియల్స్ చేసుకుంటోంది .. ఒకప్పటి అద్భుత నటి సరిత.