Swetha
భీష్మ తర్వాత నితిన్ హిట్ అనే మాటే వినలేదు. కనీసం తమ్ముడు సినిమాతో అయినా నితిన్ కంబ్యాక్ ఇస్తాడేమో అని ఎదురుచూశారు ప్రేక్షకులు. కానీ ఈసారి కూడా వెనక్కు తగ్గాల్సి వచ్చింది. వీకెండ్ లో కూడా మూవీ చాలా స్లో గా సాగింది. దీనితో నితిన్ కష్టానికి తగి ప్రతిఫలం ఎప్పుడు వస్తుందా? అని ఆయన అభిమానులతో పాటుగా సినీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే..
భీష్మ తర్వాత నితిన్ హిట్ అనే మాటే వినలేదు. కనీసం తమ్ముడు సినిమాతో అయినా నితిన్ కంబ్యాక్ ఇస్తాడేమో అని ఎదురుచూశారు ప్రేక్షకులు. కానీ ఈసారి కూడా వెనక్కు తగ్గాల్సి వచ్చింది. వీకెండ్ లో కూడా మూవీ చాలా స్లో గా సాగింది. దీనితో నితిన్ కష్టానికి తగి ప్రతిఫలం ఎప్పుడు వస్తుందా? అని ఆయన అభిమానులతో పాటుగా సినీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే..
Swetha
ఒకప్పుడు నితిన్ సినిమాలన్నీ కూడా యూత్ ని తెగ ఉత్సాహపరుస్తూ ఉండేవి. జయం, దిల్ ,సై లాంటి ఎన్నో హిట్స్ ను కెరీర్ స్టార్టింగ్ లోనే అందుకున్నాడు నితిన్ ఆ తర్వాత మధ్యలో కొన్ని ప్లాపులు పడినా కానీ .. ఇష్క్ , గుండెజారి గల్లతైంది లాంటి మ్యాజికల్ కల్ట్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఏకంగా త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో అఆ లాంటి మూవీ తీసి హిట్ కొట్టాడు. అలా నితిన్ బ్లాక్ బస్టర్స్ కాకపోయినా.. డీసెంట్స్ హిట్స్ అందుకుంటూ ఓ మంచి హీరోగా రాణించాడు. కానీ ఇప్పుడు నితిన్ డైరీ అంతా డిజాస్టర్స్ , ఫెయిల్యూర్స్ తోనే నిండిపోయింది.
మరీ ముఖ్యంగా భీష్మ తర్వాత నితిన్ హిట్ అనే మాటే వినలేదు. కనీసం తమ్ముడు సినిమాతో అయినా నితిన్ కంబ్యాక్ ఇస్తాడేమో అని ఎదురుచూశారు ప్రేక్షకులు. కానీ ఈసారి కూడా వెనక్కు తగ్గాల్సి వచ్చింది. వీకెండ్ లో కూడా మూవీ చాలా స్లో గా సాగింది. దీనితో నితిన్ కష్టానికి తగి ప్రతిఫలం ఎప్పుడు వస్తుందా? అని ఆయన అభిమానులతో పాటుగా సినీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. తమ్ముడు సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 2.5 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమా తీస్తే 2.5 కోట్లు మాత్రమే వచ్చినట్లు టాక్. సో ఈసారి కూడా నితిన్ నష్టపోయినట్లే.
ఒకప్పుడు వరుస డిజాస్టర్స్ చూసినా ఇంకో రెండు మూడు హిట్స్ అందుకుని సక్సెస్ అయ్యాడు. కానీ ఇప్పుడున్న మార్కెట్ లో ఇలా వరుస డిజాస్టర్స్ ఎదుర్కోవడం.. నితిన్ కెరీర్ కు కాస్త రిస్క్ అనే చెప్పాలి. కథలను ఎంచుకోవడంలో లోపమో.. మరేదైనా లోపమో తెలీదు కానీ.. ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ , ఆడియన్స్ పల్స్ ను క్యాచ్ చేయాలంటే.. నితిన్ స్కూల్ మార్చాల్సిందే. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సిందే. నితిన్ నుంచి నెక్స్ట్ ఎల్లమ్మ అనే సినిమా వస్తుంది. మరి ఈ సినిమాతో అయినా నితిన్ లేచి నిలబడతాడేమో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.