Swetha
హోంబేలె నిర్మాణ సంస్థ ఏకంగా మహావిష్ణు అవతారలపై ఏడు సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఏ ఏ సినిమాలు ఏ ఏ సంవత్సరాలలో వస్తాయో ఇప్పుడే చెప్పేయడంతో. హోంబేలె భారీ రిస్క్ చేస్తుందని అంతా అనుకున్నారు.
హోంబేలె నిర్మాణ సంస్థ ఏకంగా మహావిష్ణు అవతారలపై ఏడు సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఏ ఏ సినిమాలు ఏ ఏ సంవత్సరాలలో వస్తాయో ఇప్పుడే చెప్పేయడంతో. హోంబేలె భారీ రిస్క్ చేస్తుందని అంతా అనుకున్నారు.
Swetha
హోంబేలె నిర్మాణ సంస్థ ఏకంగా మహావిష్ణు అవతారలపై ఏడు సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఏ ఏ సినిమాలు ఏ ఏ సంవత్సరాలలో వస్తాయో ఇప్పుడే చెప్పేయడంతో. హోంబేలె భారీ రిస్క్ చేస్తుందని అంతా అనుకున్నారు. రీసెంట్ గా మహావతార్ నరసింహ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. వరుసగా హోంబేలె ఫిల్మ్స్ నుంచి ‘మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధావకధేష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) చిత్రాలు రాబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పైగా ఈ మధ్య కాలంలో ఇలాంటి యానిమేటెడ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ కూడా దక్కుతుంది.
మూవీ ట్రైలర్ చూస్తేనే.. ఓ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందని తెలుస్తుంది. మహా విష్ణువు గురించి , భక్త ప్రహల్లాదుడి గురించి ఇప్పటివరకు ఎంతో మంది ఎన్నో సినిమాలను రూపొందించారు. అయితే ఇప్పుడు వాటి అన్నిటికి భిన్నంగా యానిమేషన్ రూపంలో ఈ సినిమాను ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇప్పటి జెనెరేషన్ వారికి ఇలాంటి సినిమాలు నచ్చాలి అంటే ఇదే బెస్ట్ వే అని చెప్పి తీరాల్సిందే. పైగా యానిమేటెడ్ వీడియోస్ ను ఈ మధ్య చిన్నా పెద్ద తేడా లేకుండా చూస్తూనే ఉన్నారు. అందులోను ఈ మహావతార్ నరసింహ సినిమాను 3డి వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట మేకర్స్. ఈ సినిమా జూలై 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఇక ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.