శ్రీ చైతన్య నారాయణ (చైనా) జూనియర్ కాలేజీలకు తెలంగాణ సర్కారు షాకిచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కాలేజీలపై సీఎం కేసీఆర్ కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కాలేజీలో పై దాడులు చేసిన ఇంటర్ బోర్డు తెలంగాణ వ్యాప్తంగా 68 కాలేజీలు మూసివేసింది. ఇందులో శ్రీ చైతన్య సంస్థకు చెందిన 26 కాలేజీలు, నారాయణ సంస్థకు చెందిన 18 కాలేజీలు ఉన్నాయి. విద్యార్థుల భవితకు మూలమైన ఇంటర్ విద్య పై శ్రీ చైతన్య, […]
కమ్యూనిస్టులంటే చాలామందికి పోరాడేవాళ్లుగా గుర్తుకొస్తారు. కానీ కొందరు మాత్రం ప్రచారం కోసమే ఉంటారు. ప్రచారం వస్తుందంటే ఏదయినా చేసేందుకు సిద్ధపడే సెక్షన్ కమ్యూనిస్టులలో కూడా పెరుగుతుండడమే వర్తమాన వాస్తవం. అందుకు మంచి ఉదాహరణ సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన తీరు గత రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. ప్రతీ సందర్భంలోనూ ఆయన ప్రచారం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అది వారి పార్టీ విధానాలకు భిన్నమైనప్పటికీ […]
ఏపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వరం పెంచుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వంతోపాటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినీ విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతిలో నడుస్తోందని, రాష్ట్రాన్ని జగన్ రివర్స్ గేర్లో పాలిస్తున్నారంటూ నారాయణ మాట్లాడుతున్నారు. అమరావతి ఆందోళనల్లో పాల్గొన్న నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఒకవైపున రాయల సీమలో తమకు ఉద్యోగావకాశాలు లేవని, కనీసం దశాబ్ధాల కలగా ఉన్న హైకోర్టునైనా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు నినదిస్తుండగా ఇటీవల జగన్ సర్కార్ రాయలసీమలో హైకోర్టుకు అంగీకరించింది. […]