iDreamPost
android-app
ios-app

29 ఏళ్లుగా వేధింపులు.. సంచలన విషయాలు వెల్లడించిన నారాయణ మరదలు!

  • Published Jul 31, 2023 | 10:05 AM Updated Updated Jul 31, 2023 | 10:05 AM
  • Published Jul 31, 2023 | 10:05 AMUpdated Jul 31, 2023 | 10:05 AM
29 ఏళ్లుగా వేధింపులు.. సంచలన విషయాలు వెల్లడించిన నారాయణ మరదలు!

ఏపీ మాజీమంత్రి పొంగూరు నారాయణపై ఆయన తమ్ముడి భార్య కృష్ణప్రియ  సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నారాయణ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తాజాగా నారాయణ వేధింపులకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. గత 29 ఏళ్లుగా నారాయణతో పాటు తన భర్త సుబ్రహ్మణ్యం అలియాస్‌ మణి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారంటూ షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నానని.. ఇప్పటికైనా తాను భయానక అనుభవాల గురించి నలుగురికి తెలియాలనే ఉద్దేశంతోనే.. వీటిని పోస్టు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే తన ఆరోపణల కారణంగా.. రాజకీయంగా నారాయణికి ఇబ్బంది కలుగుతోందని భావించి తన ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌ను మూసివేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం కృష్ణప్రియ మీడియాతో మాట్లాడారు. ‘‘పెళ్లయిన రెండో రోజు నుంచే బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు. ఆయనకు లొంగకపోవడంతో 29 ఏళ్లుగా ఆయన నన్ను వేధిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లుగా ఆయన పెట్టే బాధలు భరిస్తూ వచ్చాను. నారాయణ స్త్రీలోలుడు.. ఆయన విద్యా సంస్థల్లో పనిచేసే కొందరు మహిళా సిబ్బంది ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. సోదరి వరుసైన వారు స్నానం చేస్తున్నప్పుడు బాత్‌రూమ్‌లోకి తొంగి చూసేవాడు. ఈ విషయం మొదట్లో వాళ్ల వాళ్లే నాతో చెప్పారు. నేను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభించాడు’’ అని చెప్పుకొచ్చింది.

‘‘నాకు మానసిక సమస్య ఉన్నట్లుగా నా భర్త తప్పుడు సర్టిఫికెట్లు చూపించి.. యూట్యూబ్‌ వేదికగా ప్రచారం చేయడం చూసి నేను చాలా బాధపడ్డాను. నా మానసిక ఆరోగ్యం గురించి.. నారాయణ మెడికల్‌ కాలేజీలో పనిచేసే డాక్టర్‌ శేషమ్మ నుంచి మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకురావడం వారికి పెద్ద సమస్య కాదు. అలాగే, నారాయణ పిల్లలకు మానసిక సమస్యలు ఉన్నాయి. డాక్టర్‌ విరించి వారికి చికిత్స చేస్తున్నారు. విరించి నుంచి కూడా సర్టిఫికెట్‌ తేవడం పెద్ద కష్టమేమి కాదు. ఒకరోజు మా నాన్నపై అరుస్తుంటే గుంటూరులోని ఓ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. నిద్రలేమితో నిద్రమాత్రలు వేసుకుంటున్నట్లు డాక్టర్‌కు చెప్పాను. మానసిక ఒత్తిడితోనే నిద్రలేమి సమస్య ఉండవచ్చని డాక్టర్‌ చెప్పారు. నేను ఇటీవల ఏఐజీ ఆస్పత్రిలో చేరిన విషయం నిజమే. ఇక రక్త సంబంధం ఉంది కాబట్టే నారాయణకు నా భర్త పెట్‌గా మారాడు’’ అంటూ సంచలన ఆరోపణలు చేసింది కృష్ణప్రియ.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet