iDreamPost
android-app
ios-app

మాజీ మంత్రి నారాయణపై తమ్ముడి భార్య షాకింగ్ ఆరోపణలు!

  • Published Jul 28, 2023 | 9:48 PM Updated Updated Jul 28, 2023 | 10:02 PM
  • Published Jul 28, 2023 | 9:48 PMUpdated Jul 28, 2023 | 10:02 PM
మాజీ మంత్రి నారాయణపై తమ్ముడి భార్య షాకింగ్ ఆరోపణలు!

నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియా పొంగూరి సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ వల్ల తాను నరకం చూశాను అంటూ చెప్పుకొచ్చారు. ఒక డేగ- పిట్ట మీద కన్నేసినట్లు నారాయణ తనపై కన్నేశారు అంటూ ఆరోపించారు. ఈ విషయాలను స్వయంగా ప్రియా పొంగూరి వీడియో రూపంలో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. నారాయణ వల్ల తాను నరకం అనుభవించానని.. తనను టార్చర్ పెట్టారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనపై చేయి కూడా చేసుకున్నారంటూ తెలిపారు.

“నేను మీకు ఒక పిట్ట కథ చెబుతాను. చాలా సింపుల్ గా అర్థమయ్యేలా చెబుతాను. ఒక పిట్టను చూసేసి.. ఒక గద్ద కన్నేసింది. తీసుకెళ్లి తన గూడులో పెట్టేసుకుంది. దానిని చిత్రహింసలు పెట్టేసింది. ఆ పిట్ట ఎవరో కాదు నేనే.. ఆ గద్ద నారాయణ. మాది చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా నాన్న ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఆయన సర్వీస్ చాలా వరకు నెల్లూరులోనే జరిగింది. నారాయణకు రెండు పెళ్లిళ్లు. రెండో ఆమెకు తాళి కట్టినట్లు ప్రూఫ్స్ ఏం చేయలేదు. నాకు 18 ఏళ్లకే పెళ్లి చేశారు. అప్పుడు నాకు నారాయణ ఎవరో తెలీదు.. ఆయన కుంటంబం ఏంటో తెలీదు. నాకు పదో తరగతి నుంచే సంబంధాలు వచ్చాయి. రోజూ ఇంటికి వచ్చి తలుపు కొట్టడం మీ అమ్మాయిని మా తమ్ముడికి ఇవ్వండి అని అడగడం. మా కాస్ట్ వాళ్లు ఉంటారుగా వాళ్లని మధ్యవర్తులుగా పంపేవాళ్లు.

మా పెళ్లికి మా అత్తమామలకు ఏం సంబంధం లేదు. వీళ్లే ప్రాపర్టీలో 25 శాతం షేర్ ఇస్తాంమటూ చెప్పి పెళ్లి చేసుకున్నారు. మా నాన్న కూడా అమ్మాయి జీవితం బాగుంటుంది కదా అని పంపారు. పెళ్లైన తర్వాతి నుంచే నాకు టార్చర్ మొదలైంది. రోజులో పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు తిడుతూనే ఉంటారు. ఆయన అలా కూర్చుని తిడుతూ ఉంటే నేను అలా నిల్చోని ఏడుస్తూ ఉండేదాన్ని. అసలు నన్ను ఎందుకు తిడుతున్నారో తెలీదు. కొత్తలో నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. తర్వాత పిలవగానే కళ్లు తుడుచుకోవడానికి కర్చీఫ్ తీసుకుని వెళ్లేదాన్ని. అసలు ఎందుకు తిడుతున్నారో తెలీదు.. పెద్దాళ్లకు చెప్పాలని తెలీదు. ఏదో అలా బతికేశాను. మాది చిన్న ఇల్లు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. ఆ స్టెప్స్ ఎక్కాలి అన్నా కూడా నాకు భయం.

పైన మా రూమ్, పక్కన నారాయణ గారి రూమ్. నేను అత్తమామలతో కింద పడుకుంటాను. మా వారు వచ్చిన తర్వాత ఆయనతో పాటు పైకి వెళ్లేదాన్ని. ఓరోజు ఇంటర్ కామ్ లో ఫోన్ చేసి అన్నం తీసుకుని పైకి రా అంటూ కాల్ చేశారు. అక్క ఉందిగా పంపించడి అన్నాను. నిద్రపోతుంది నువ్వే తీసుకురా అంటూ చెప్పారు. నాకు భయం అని చెప్పినా వినకుండా పదే పదే ఫోన్లు చేశారు. మా అత్తమామలు కూడా నిద్ర లేచారు. ఇంక చివరికి కిందకు వచ్చేశారు. రాగానే పట పట కొట్టేశారు. నాకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. మా మామయ్య వచ్చి నారాయణ ఇది పద్ధతి కాదు. ప్రియా ఏమైనా తప్పుచేస్తే మణి వస్తాడు కదా.. మణికి చెప్పు ఏదైనా తప్పు ఉంటే అతను దండిస్తాడు. నువ్వు ఎవరు అసలు కొట్టడానికి అంటూ అన్నారు. వెంటనే పైకి పరిగెత్తాడు” అంటూ ఆరోపణలు చేశారు. ఇది ఒక స్టోరీ అని ఇంకో స్టోరీ మళ్లీ చెబుతానంటూ చెప్పుకొచ్చారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş