రేవంత్ రెడ్డి.. మంచి మాటకారి. ప్రస్తుతం తెలంగాణలో ఫైర్ బ్రాండ్. కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేస్తారు. కాంగ్రెస్ లో చేరి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. పీసీసీ రేసులో ఉన్నారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో జానారెడ్డి తరఫున ప్రచారం గట్టిగానే చేశారు. ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు.. ఈనెల 15న కీలక కామెంట్లు చేశారు. ‘‘17వ తారీఖున పోలింగ్ పూర్తయ్యాక.. మంత్రులు, ఇన్ చార్జ్ లుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలకు వెళ్లిపోతారు. […]
పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలనే కసితో టీఆర్ఎస్ పని చేస్తోంది. ఆ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. తమ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. గెలుపు సూత్రాలు నేర్పుతున్నారు. తనకున్న రాజకీయ అనుభవంతో ఎదుటి పార్టీలోని అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసి జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకతను తమ పార్టీ అభ్యర్థులకు తెలియజేస్తున్నారు. కేసీఆర్ హాలియాలో సభ నిర్వహించిన తర్వాత తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. ఆ […]