ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో రెండోసారి అధికారం చేపట్టి జోరు మీదున్న భారతీయ జనతా పార్టీ తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించింది. ఎన్నికలు జరిగిన 36 స్థానాల్లో 32 చోట్ల విజయం సాధించి.. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీని ఒక్క సీటుకే పరిమితం చేసింది. అయితే ఒకే ఒక్క నియోజకవర్గంలో ఓటమి ఆ పార్టీని కుంగదీస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ స్థానానికి కేంద్ర స్థానమైన […]
తిరుపతి ఉప ఎన్నికకు ముందే ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. పోతుల సునీత రాజీనామాతో ఖాళీ అయిన శాసన మండలి సభ్యత్వానికి ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఈ నెలాఖరు నాటికి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసేలా నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. 18వ తేదీ […]
ఒక నియోజకవర్గంలో వాడివేడిగా ప్రచారం.. మరో నియోజకవర్గంలో అసలు హడావుడే లేదు.! త్వరలో ఎన్నికలు జరగనున్న శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో పరిస్థితి. రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా.. వరంగల్- ఖమ్మం- నల్లగొండపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నప్పటికీ నాయకులు పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. వరంగల్- ఖమ్మం- నల్లగొండ స్థానంలో పోటీకి సిద్ధపడ్డ అభ్యర్థుల్లో ముఖ్యులు ఉండడం, వారి ప్రచారం జోరుగా సాగుతుండడం, నియోజకవర్గంలోని […]
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్రలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల కోటాలో ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానంలో గెలవగా.. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోనూ ఆ పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. ఐదు పట్టభద్రులు, ఆరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గత మంగళవారం ఎన్నికలు జరిగాయి. 11 స్థానాల్లో బీజేపీ ఆరు […]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటామనే సంతోషంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదరయ్యాయి. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే స్థానంలో గెలిచింది. అధికార శివసేన–ఎన్షీపీ–కాంగ్రెస్ (మహా వికాస్ ఆఘాఢీ) కూటమి సత్తా చాటింది. నాలుగు స్థానాల్లో మహాకూటమి గెలుపొందింది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పట్టభద్రుల నియోజకవర్గాల్లో మహాకూటమి జయకేతనం ఎగురవేసింది. ఔరంగాబాద్, పుణెలలో ఎన్సీపీ, నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ […]
తెలుగుదేశం వెనకడుగు వేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నింటా అడ్డంకులు కల్పించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు తొలిసారిగా ముందడుగు వేయలేక మౌనంగా ఉండిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఆశ్చర్యకర అంశమే. పైగా తాము పోటీలో ఉంటామని ప్రకటించిన తర్వాత కూడా టీడీపీ తయారు కాలేకపోవడం విశేషమే. ఏపీలో ఖాళీ అయిన ఒక్క మండలి సీటుకి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే టీడీపీ సై అని ప్రకటించింది. తాము కూడా అభ్యర్థిని రంగంలో దింపుతామని చెప్పింది. […]
ఆంధ్రప్రదేశ్ శాశన మండలికి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున డొక్కా మాణిఖ్య వర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత తెలుగుదేశం నుండి పోటీకి అభ్యర్ధిని నిలబెడతారని ఊహాగానాలు వచ్చినా నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్ధులు ఎవరూ నామినేషన్ గడువు ముగిసే లోపు రాకపోవడంతో డొక్కా మాణిఖ్య వరప్రసాద్ అధికార పార్టీ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. Also Read: టీడీపీ కి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ మండలిలో మూడు రాజధానుల పై చర్చ సందర్భంగా […]