iDreamPost
android-app
ios-app

Teenmar Mallanna: ఎన్నికల వేళ తీన్మార్‌ మల్లన్న సంచలన నిర్ణయం.. ఆస్తులన్నీ వారికి అప్పగింత

  • Published May 04, 2024 | 8:14 AM Updated Updated May 04, 2024 | 8:14 AM

పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తోన్న తీన్మార్‌ మల్లన్న సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఆస్తులన్నీ వారికి అప్పగిస్తూ.. ప్రకటన చేశారు. ఆ వివరాలు..

పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తోన్న తీన్మార్‌ మల్లన్న సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఆస్తులన్నీ వారికి అప్పగిస్తూ.. ప్రకటన చేశారు. ఆ వివరాలు..

  • Published May 04, 2024 | 8:14 AMUpdated May 04, 2024 | 8:14 AM
Teenmar Mallanna: ఎన్నికల వేళ తీన్మార్‌ మల్లన్న సంచలన నిర్ణయం.. ఆస్తులన్నీ వారికి అప్పగింత

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర సాగుతోంది. మరో 9 రోజుల్లో అనగా మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల పోరుకు సమయం దగ్గర పడుతుండటంతో.. నేతలంతా స్పీడు పెంచారు. రోజుకు పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు నిర్వహిస్తూ.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో మాత్రం లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక వీటితో పాటు.. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ బరిలో దిగుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు తీన్మార్‌ మల్లన్న.

అనంతరం నిర్వహించిన సభలో తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. సంచలన ప్రకటన చేశారు. గతంలో తాను చెప్పినట్టుగానే.. తన కుటుంబానికి ఉన్న కోటిన్నర విలువైన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని బహిరంగ సభ వేదిక మీదుగా చెప్పుకొచ్చారు. ఈ మేరకు నామినేషన్ పత్రంతో పాటు తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తానని వెల్లడించే బాండ్‌ను కూడా సమర్పించారు. ఆయన నిర్ణయం ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేసింది.

Mallanna

ఈ సందర్భంగా తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వెళ్లి నా ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ప్రభుత్వానికి అప్పగిస్తాను. అంతేకాక ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయికి జవాబుదారిగా ఉంటాను. నేను స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని భావిస్తున్నాను. అందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. దమ్ముంటే ప్రత్యర్థులు కూడా నాలా ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చి ఎన్నికల్లో నిలబడాలి’’ అంటూ ఆయన సవాల్‌ విసిరారు. అంతేకాక అలా ఎవరూ చేయరని చెప్పుకొచ్చారు.

అయితే.. తాను గతంలో చెప్పిన ప్రతి మాటకు తాను కట్టుబడి ఉంటానని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని.. నిరుద్యోగుల గొంతుకగా మారి.. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. దానికోసం అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఈసారి భారీ మెజార్టీతో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని పట్టభద్రులంతా ఎదురుచూస్తున్నారని తీన్మార్‌ మల్లన్న చెప్పుకొచ్చారు.

ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మే 2 నుంచి నామినేషన్ల పర్వ మొదలు కాగా.. ఈ నెల 9 వరకు కొనసాగనుంది. ఈ నెల13 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా.. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే.. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవటంతో.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.