iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ శాశన మండలికి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున డొక్కా మాణిఖ్య వర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత తెలుగుదేశం నుండి పోటీకి అభ్యర్ధిని నిలబెడతారని ఊహాగానాలు వచ్చినా నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్ధులు ఎవరూ నామినేషన్ గడువు ముగిసే లోపు రాకపోవడంతో డొక్కా మాణిఖ్య వరప్రసాద్ అధికార పార్టీ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.
Also Read: టీడీపీ కి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్
మండలిలో మూడు రాజధానుల పై చర్చ సందర్భంగా తెలుగుదేశం వైఖరికి నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేసిన డొక్కా మాణిఖ్య వరప్రసాద్ ఆ తరువాత వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తిరిగి అధికార పార్టీ తరుపున నిలబడి ఏకగ్రీవంగా ఎన్నికై మళ్ళీ మండలిలో అడుగుపెట్టారు …