తెలుగుదేశంపార్టీ రెబల్ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలు ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు ఫ్రస్టేషన్ తెప్పిస్తున్నారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులు బిల్లులపై మండలి సమావేశాలకు హాజరకావాలంటూ టీడీపీ జారీ చేసిన విప్ను ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు ధిక్కరించారు. అప్పటి నుంచి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ శాసన మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై చైర్మన్ పలుమార్లు విచారణ జరిపారు. అయితే […]
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ మరోసారి మండలిలో అడుగుపెట్టబోతున్నారు. ఏకైక స్థానానికి జరగబోతున్న ఎన్నికల్లో ఆయన అధికార పార్టీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఆమేరకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం నాడు ఆయన నామినేషన్ వేయబోతున్నారు. వచ్చే నెల 6న ఎన్నిక జరగబోతోంది. టీడీపీ అభ్యర్థిని బరిలో దింపుతామని ఇప్పటికే ప్రకటించింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న తరుణంలో ఈసారి మళ్లీ తలబొప్పికొట్టించుకునే నిర్ణయం తీసుకుంటా లేదా అన్నది […]
శాసనమండలి రద్దు కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం కేంద్రం పరిధిలో పెండింగ్ లో ఉంది. అసెంబ్లీ ఆమోదంతో తీర్మానం హస్తిన వద్ద పెండింగ్ లో కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాలు నిర్దేశిత గడువు ప్రకారం సాగితే మండలి రద్దుకు అవకాశం ఉందని గత మార్చిలో అంతా ఆశించారు. కానీ అనూహ్యంగా కరోనా లాక్ డౌన్ తో పార్లమెంట్ సమావేశాలను అర్థాంతరంగా ముగించడంతో కీలక బిల్లులకు మోక్షం కలగలేదు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల ముందుకు ఈ […]
తెలంగాణలో అధికార టిఆర్ఎస్లో ఇప్పుడా పదవులపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. వాటి కోసం ఏకంగా ముప్పై మంది పోటీ పడుతుండటం గమనార్హం. కొందరు నేతలు తమ పదవులు… తమకే కావాలని పట్టుబడుతుంటే… ఈసారి ఎలాగైనా ఆ పోస్టులను దక్కించుకోవాలని మరికొందరు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిస్థితి… ఆ పార్టీ అధినేతకు ఒకింత తలనొప్పిగా మారిందని ఆ పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న మాటలు. టిఆర్ఎస్లో ఎమ్మెల్సీ పదవుల గొడవ మొదలైంది. జూన్ నెలాఖరుకు మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతుండటంతో […]
ఇద్దరు టిడిపి ఎంఎల్సీలపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైందా ? శాసనమండలి కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనే ఇదే అనుమానం పెరిగిపోతోంది. శాసనమండలిలో రెండు అంశాలకు సంబంధించి జరిగిన ఓటింగ్ లో పార్టీ జారీ చేసిన విప్ ను ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేయాలంటూ కౌన్సిల్లో పార్టీ విప్ బుద్ధా వెంకన్న ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కు ఫిర్యాదుచేశాడు. ఆ నోటీసును బేస్ చేసుకుని ఛైర్మన్ ఆదేశాల ప్రకారం మండలి కార్యదర్శి బాలకృష్ణామాచార్యులు ఎంఎల్సీలు […]
“మనవాళ్ళు బ్రీఫుడ్ మీ..” అంటూ ఒక ప్రముఖు రాజకీయ నాయకుడి వాయిస్ క్లిప్ తో అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణ.. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. 2014 లో అప్పటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని భావించిన పార్టీ అధినేత తన ముఖ్య అనుచరుడి ద్వారా ఎమ్మెల్సీలను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అడ్డంగా దొరికిపోవడంతో ఈ కేసు అప్పట్లో ఇరు […]
స్వాతంత్య్ర సమరయోధులంటే ఎవర్రా అడిగాడు వెంగల్రావ్… ఆమాత్రం తెలీదా నీకు… మన దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి జైళ్లలో మగ్గి, తమ జీవితాలను ధారబోసిన మహనీయులేరా స్వతంత్ర సమరయోధులంటే.. అదికూడా తెలీదట్రా నీకు… వెటకారంగా అన్నాడు అమాయకరావు.. నువ్ ఇంత అమాయకుడివి కాబట్టే నీకు అమాయకరావు అని పేరెట్టార్రా నీకు భుజాలెగరేస్తూ అన్నాడు వెంగల్రావ్.. అర్థమయ్యేలా చెప్పెహే ఇష్టమొచ్చినట్లు వాగకుండా.. స్వాతంత్య్ర సమరయోధులంటే వాళ్లేరా.. కావాలంటే నేను చదివిన పుస్తకాల్లో చూపిస్తా అంతేకాని ఇలా తెలిసి […]
రాము సూర్యారావు మాస్టారు… ఏలూరు పరిసర ప్రాంతాల వారికి పరిచయం అక్కర్లేని పేరు. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తున్న పేరు.. కుటుంబ సభ్యులనే నమ్మకుండా, ఎవడి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న ఈ రోజుల్లో సాటి మనుషులకు సాయం చేస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్న రాము సూర్యారావును చూస్తే అభినవ దానకర్ణుడు అనొచ్చేమో.. రాముసూర్యారావుకి చిన్ననాటి నుండే సేవాగుణం మెండు. చిన్న వయసులోనే స్నేహితులకు సాయం చేస్తూ ఆనందపడేవారు. చదువుకునే వయసులో తన తండ్రి IAS […]