iDreamPost
android-app
ios-app

కర్నూల్లో కలకలం.. YCP ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడి దారుణ హత్య..

  • Published Jan 07, 2024 | 1:42 PM Updated Updated Jan 07, 2024 | 1:42 PM

కర్నూలు జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ వివరాలు..

కర్నూలు జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ వివరాలు..

  • Published Jan 07, 2024 | 1:42 PMUpdated Jan 07, 2024 | 1:42 PM
కర్నూల్లో కలకలం.. YCP ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడి దారుణ హత్య..

ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ సోదరుడు ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు.. రాయితో తలపై మోది చంపేశారు. దాంతో కర్నూలు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ వివరాలు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు రాములు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండుగుల.. ఆదివారం కర్నూలు జిల్లాలో రాములుని దారుణంగా హత్య చేశారు. పెండేకల్లు రైల్వే జంక్షన్‌ వద్ద రాములు మీద రాయితో దాడి చేసి చంపేశారు. ఈ దారుణంతో కర్నూలు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఎమ్మెల్సీ పోతుల సునీత స్వస్థలం కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని తుగ్గలి. ఆమె సోదరులు రాము, లెనిన్ బాబు అక్కడే నివాసం ఉంటున్నారు. ఇక నేడు హత్యకు గురైన రాములు.. సుమారు 30 ఏళ్ల కిందట పీపుల్స్ వార్ పార్టీలో పని చేసి.. 1991లో పోలీసులకు లొంగిపోయారు. ఆ తర్వాత నుంచి స్వగ్రామంలో ఉంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే గత 10 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఈక్రమంలో రాములు శనివారం రాత్రి రైల్వే స్టేషన్‌లో నిద్రించిన సమయంలో.. దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Murder of MLC Potula Sunitha's brother

ఆయన తమ్ముడు, ఉద్యమకారుడు పూజారి లెనిన్ బాబు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా తన అన్న మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపాడు. అలాంటి వ్యక్తిని.. ఇంత దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరమని అన్నారు. తన అన్నను హత్య చేసిన వారిని వదిలిపెట్టకూడదన్నారు. ఇక ఆదివారం సాయంత్రం ఆర్ఎస్ పెండేకల్లులో రాములు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis