స్నేహానికి, తన అనుకునేవారికి సీఎం వైఎస్ జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో మరోసారి నిరూపితమైంది. తన స్నేహితుడు, సమర్థవంతమైన నేతగా పేరొందిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ అపూర్వ నివాళి అర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెడుతూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్.. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీగా […]
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి తాను, వైసీపీ అండగా ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీగా పేరు పెడతామని స్పష్టం చేశారు. వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి – ప్రశాంతి దంపతులు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంస్మరణ సభను నెల్లూరు నగరంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి […]
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఘన నివాళి అర్పించింది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే గౌతమ్ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం పలువురు సభ్యులు, సీఎం జగన్ మంత్రి గౌతమ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డిని తలుచుకుంటూ సీఎం జగన్ ఉద్వేగానికి లోనయ్యారు. గౌతమ్ కన్న కలలను తాను సాకారం చేస్తానని, తన ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆకాంక్షను […]
దేశంలో కరోనా వైరస్ లాక్ డౌన్ తో అన్ని రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. ఒకవైపు ఆర్థికంగా ఇబ్బందులు, మరోవైపు నిరుద్యోగం ఇలా రెండు రకాల పారిశ్రామిక వృద్ధి పడిపోయింది. అయితే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ త్వరగా కోలుకొని ఒకవైపు సంక్షేమ పాలన కొనసాగుతుంటే…మరోవైపు పారిశ్రామిక పరుగులు పెడుతుంది. ఇప్పటికి రెండు సెల్ ఫోన్ తయారీ యూనిట్లు, రాష్ట్రంలో అదాని గ్రూప్ పెట్టుబడులు, ప్రతిష్ఠాత్మక కార్లు కంపెనీ కియా పెట్టుబడి పెంచడం వంటి పారిశ్రామిక నిర్ణయాలు జరిగాయి. ఇవన్నీ లాక్ డౌన్ […]