తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు తూట్లు పొడిచి మద్యంపై నిషేధం ఎత్తివేసిన చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు మద్య నియంత్రణకు ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై మాట్లాడడం హాస్యాస్పదంగా మారింది. విపత్కర పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి మద్యం దుకాణాలను తగ్గిస్తూ.. చిత్త శుద్ధితో పని చేస్తున్న జగన్ పాలనపై విధ్వంసానికి ఒక్క […]
గడిచిన 5ఏళ్ళలో ధనార్జనే ధ్యేయంగా బ్రతికిన తెలుగుదేశం పార్టీలోని కొందరు సభ్యులు అధికారం కోల్పోయిన తరువాత కూడా వారి పంథా మార్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే అనేకమంది తెలుగుదేశం సభ్యులు ఇసుకని అక్రమంగా తరలిస్తు, నాటు సారా తయారు చేస్తూ , గుట్కా ప్యాకెట్లు అక్రమంగా సరఫరా చేస్తూ పొలీసులకి చిక్కారు. ఇప్పుడు తాజాగా స్వయాన తెలుగుదేశం పార్టీ కి చెందిన మాజీ శాసన సభ్యుని కొడుకే కర్నాటక నుండి అక్రమంగా మద్యాన్ని పెద్ద ఎత్తున తరలిస్తూ పోలీసులకి పట్టుబడ్డాడు. […]
ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా పై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. మాతృభూమి పౌండేషన్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దుకాణాల వద్ద భౌతిక దూరం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. మద్యం తాగడం తో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని వివరించారు. మద్యపాన నిషేధానికి ఈ అవకాశాన్ని […]
ఇంటి మగ దిక్కులు మద్యం మహమ్మారి బారిన పడి జేబుతో పాటు శరీరాన్ని కూడా గుల్ల చేసుకుంటుంటే కన్నీరు కార్చని అక్కాచెల్లెళ్లకు కొదవేలేదు రాష్ట్రంలో. కానీ ఇది త్వరలోనే గతం కానుంది. ఆ అక్క చెల్లెల ముఖంపై చిరునవ్వు నిలిచే రోజులు త్వరలోనే మన ముందుకు రానున్నాయి. దశల వారి మధ్య నిషేధం దిశగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేగంగా చర్యలు ప్రారంభించారు. తాను చెప్పిన మాటకు ఎట్టి పరిస్థితుల్లోనూ మారుమాటలు ఉండవని మరోమారు స్పష్టం […]
అధికారంలో ఉండగా అన్నీ తానేనని, అధికారం కోల్పోగానే ప్రజల కోసమే తాను ఉన్నాననే ఒక విచిత్రమైన వ్యాధితో ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రుడు బాధపడుతుంటారు. (లాక్ డౌన్ పుణ్యమాని ప్రస్తుతం తెలంగాణ లో ఉన్నాడు లెండి). ఇది ఇంతకు ముందు ప్రజలకు అర్థం అయింది. మళ్ళీ మళ్ళీ అర్థమవుతూనే ఉంది. కానీ ఆయనకు మాత్రం అర్థం కావడం లేదు. అది ఏంటంటే తను ప్రజలు క్వారంటైన్ కి పంపించారు అన్నది. మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ ను, అది […]
దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యం. దాదాపుగా 50 రోజులుగా లాక్డౌన్ వల్ల దేశంలోని మద్యం షాపులన్నీ మూతవేసి ఉన్నాయి. మొన్న కేంద్రం మద్యం అమ్మకాలు చేసుకునేందుకు సడలింపులు ఇచ్చింది. కేంద్ర మార్గదర్శకాలకు లోబడి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేసినట్లే ఏపీలోనూ మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. ఇందులోనూ విపక్షాలు విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెడుతున్నాయి. మద్యంతో ఖజానా నింపుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొందరు విపక్ష నాయకులు అంటుంటే.. దోపిడీ చేస్తోందని కొందరు, మంచి బ్రాండ్లు […]
ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన పనులు, పదవి పోగానే మరచిపోతారు. పోనీ ప్రతిపక్షంలో చెప్పిన మటలు అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకుంటారా అంటే అదీ ఉండదు. అదే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకతకు దారితీసింది. అయినప్పటికీ ఆయన ధోరణి మారడం లేదు. విపక్ష నేతగా విపరీత స్థాయిలో నీతిసూత్రాలు వల్లించడం ఆపడం లేదు. తాను అధికారంలో ఉండగా వేటిని కాదన్నారో వాటినే ఇప్పుడు అమలు చేయాలని చెప్పడం కూడా ఆయన ధోరణిని […]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన టిడిపి నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. మొన్న అధికారంలో ఉన్న నేడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పై, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అర్థం పర్థం లేని ఆరోపణలు విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా ఈ మాజీ మంత్రి మద్యం అమ్మకాల వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం ప్రవేశపెట్టి ప్రజల […]
మే 4 నుంచి కరోనా ప్రభావం తక్కువగా/అసలు లేని గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభించే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. దేశంలో మద్యం అమ్మకాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పక్క రాష్ట్రంలో కూర్చుని ఉన్నప్పటికీ … ఆయన, ఆయన పార్టీ నాయకులు, వారి కన్నా ప్రమాదకరమైన వారి అనుకూల మీడియా సహాయంతో ప్రభుత్వం […]
ఒక వ్యక్తికి కానీ , సంస్థకి కానీ తమది కాని విధానం, తమకు అవకాశం ఉన్నప్పుడు అమలు చేసే ప్రయత్నం చేయని కార్యాచరణ కానీ ఇతరులకు బోధించే అర్హత ఉండదు . 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదటి ఐదు సంతకాల్లో బెల్ట్ షాపుల నిషేధం కూడా ఒక సంతకం . కాగా బెల్ట్ షాపులనేవి అక్రమం అయితే వాటి పై అధికారికంగా నిషేదం విధించడం ఏమిటో. అది మొదటి సంతకం ఏమిటో అంటూ రాష్ట్రంలో […]