iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగితే పక్షవాతం వస్తుంది… సోమిరెడ్డి కనుగొన్న సత్యం!!!

  • Published May 05, 2020 | 6:21 AM Updated Updated May 05, 2020 | 6:21 AM
  • Published May 05, 2020 | 6:21 AMUpdated May 05, 2020 | 6:21 AM
ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగితే పక్షవాతం వస్తుంది… సోమిరెడ్డి  కనుగొన్న సత్యం!!!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన టిడిపి నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. మొన్న అధికారంలో ఉన్న నేడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పై, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అర్థం పర్థం లేని ఆరోపణలు విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా ఈ మాజీ మంత్రి మద్యం అమ్మకాల వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అంటూ సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల లభించే మద్యం వారం రోజులు తాగితే పక్షపాతం వస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. ప్రాణాంతకమైన మద్యం తీసుకొచ్చి ప్రజల గొంతు లోకి పోస్తున్నారని చెప్పుకొచ్చారు.

వైసిపి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఈ నెలాఖరుతో ఏడాది అవుతోంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తూ.. మద్య పాన నిషేధం దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాల సమయం వేళలు కుదించడం మద్యం, దుకాణాలు తగ్గించడం వంటి అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుంది. మద్యం రేట్లను పెంచడంతో పాటు కొత్త కొత్త బ్రాండ్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశ్యం ప్రజలను క్రమక్రమంగా మద్యానికి దూరం చేయడమే.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గిందని ఎక్సైజ్ శాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. టిడిపి ప్రభుత్వ హయాంలో విజయవాడలో దుకాణంలో కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుకు తెచ్చుకున్న సోమిరెడ్డి తాజా ఆరోపణలు చేసి ఉంటారు. సదరు మాజీ మంత్రి తెలుసుకోవాల్సింది.. వైసిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అలాంటి ఘటనలు ఇప్పటివరకు చోటు చేసుకోలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబుతున్నట్లు వారం రోజులు మద్యం తాగితే పక్షవాతం ఎవరికి వచ్చిందో ఆయన చూపించాలని వైసీపీ నేతల అడుగుతున్నారు. మరి సోమిరెడ్డి పక్షవాతం వచ్చిన వారిని ఒకరిద్దరినైనా చూపించగలరా..?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet