అమలాపురంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. రాళ్లు రువ్వారు. తగలబెట్టారు. అయినా ఎక్కడా, ఎవరిపైనా, లాఠీ విరిగలేదు. 20మంది పోలీసులకు రాళ్ల దెబ్బలు తగిలినా, సంయమనం పాటించారు. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని చుట్టుముట్టి విధ్వంసం సృష్టించిన సమయంలో, ప్రజా ప్రతినిధులను అమలాపురం నుంచి వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో పోలీసులు విజయవంతమైయ్యారు. అదేసమయంలో ఆందోళనకారుల అదుపులో ఎక్కడా పట్టు తప్పలేదు. గొడవలు వద్దని ఇరు వర్గాలకూ చెబుతూ వచ్చారు. కొన్ని అసాంఘిక శక్తులు అమలాపురంలో మంగళవారం మధ్యాహ్నం అల్లర్లు, […]
కోనసీమ జిల్లా పేరును మార్చడంపై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో ఓ ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టి.. బీభత్సం సృష్టించారు ఆందోళన కారులు. సమయానికి పోలీసులు రాకపోతే నా కుటుంబమంతా సజీవ దహనమై ఉండేదని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. చాలా ప్రాంతాల్లో ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు. ఆందోళనల్లో భాగంగా ఆందోళనకారులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి […]