ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతర ముఖ్యనేతలు.. ప్రముఖలు ఎవరైన మరణిస్తే.. వారి అంత్యక్రియల్లో పాల్గొంటారు. అలానే కొన్ని సందర్భాల్లో సామాన్యులు అంత్యక్రియలకు కూడా ప్రజాప్రతినిధులు హాజరవుతుంటారు. ఇంకా కొందరు నేతలు.. అంత్యక్రియల్లో పాల్గొనడమే కాకుండా స్వయంగా వారే పాడె మోసి.. సదరు వ్యక్తులకు నివాళర్పిస్తుంటారు. తాజాగా ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కూడా ఓ జవాన్ పాడెను మోశారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భారత సైన్యంలో పనిచేస్తోన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం పేకేరు భీమ్ నగర్ కు చెందిన పిట్టా శ్రీనివాస్ (40) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆర్మీలో హవాల్దర్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలనే గుండెపోటుతో మరణించారు. ఇక శ్రీనివాస్ పార్ధీవదేహాన్ని చూసి ఆయన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక శ్రీనివాస్ మృతితో పేకేరు భీమ్ నగర్ లో విషాదం నెలకొంది. ఆయనకు స్థానిక నేతలు, పలువురు అధికారులు నివాళ్లర్పించారు. అలానే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా శ్రీనివాస్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అలానే ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఇక శ్రీనివాస్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం పేకేరులోని ఆయన స్వగ్రామంలో పూర్తి ప్రభుత్వ, అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. శ్రీనివాస్ మృతదేహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. అంతేకాక శ్రీనివాస్ శవ పేటికను మంత్రి వేణుగోపాలు మోశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి సింధు సుబ్రహ్మణ్యం, ఆర్మీ, నేవీ అధికారులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వాలంటీర్ సాహసం.. అగ్నిగుండంలో దూకి వ్యక్తి ప్రాణాలు కాపాడాడు!