iDreamPost
android-app
ios-app

కోనసీమ జిల్లా రగడ.. ఎమ్మెల్యే ఇంటికి నిప్పు

  • Published May 25, 2022 | 11:52 AM Updated Updated Dec 12, 2023 | 6:20 PM

ఈ ఆందోళనల్లో ఓ ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టి.. బీభత్సం సృష్టించారు ఆందోళన కారులు.

ఈ ఆందోళనల్లో ఓ ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టి.. బీభత్సం సృష్టించారు ఆందోళన కారులు.

కోనసీమ జిల్లా రగడ.. ఎమ్మెల్యే ఇంటికి నిప్పు

కోనసీమ జిల్లా పేరును మార్చడంపై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో ఓ ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టి.. బీభత్సం సృష్టించారు ఆందోళన కారులు. సమయానికి పోలీసులు రాకపోతే నా కుటుంబమంతా సజీవ దహనమై ఉండేదని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. చాలా ప్రాంతాల్లో ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు.

ఆందోళనల్లో భాగంగా ఆందోళనకారులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారు. సమయానికి పోలీసులు అక్కడికి వచ్చి గాల్లోకి కాల్పులు జరపడంతో ఆందోళన కారులు అక్కడి నుంచి చెదిరిపోయారు. ఎమ్మెల్యే తో పాటు అతని కుటుంబ సభ్యులను బయటికి తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రేనని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజాప్రతినిధుల ఇళ్లపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం అంటే.. పక్కా ప్రణాళికతో చేసిన చర్యేనని మండిపడ్డారు.