సినిమాల్లో ట్రిపుల్ రోల్ చాలా అరుదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ, అప్పుడెప్పుడో చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు, అంతకుముందు అన్న ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ లాంటివి తప్ప మరీ గుర్తుంచుకోదగ్గవి చాలా తక్కువ. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనూ అలాంటి చెప్పుకోదగ్గ చిత్రం ఒకటుంది. ఆ ముచ్చట్లు చూద్దాం. 1969 తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా ‘దైవ మగన్’ వచ్చింది. ఏసి త్రిలోకచందర్ దర్శకులు. కమర్షియల్ గానూ ఈ మూవీ గొప్ప విజయం అందుకుంది. […]
సీనియర్ నటి జయంతి చనిపోయారు. ఆమె అసలు పేరు కమలకుమారి. ఆమె మా ముందు తరం హీరోయిన్. అయితే నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి. పదేళ్ల వయసు నుంచే విజయచిత్ర, సినిమా రంగం పత్రికలు చదివే అలవాటు. 1973లో ఫస్ట్ టైం సినిమా రంగంలో జయంతి ఇంటర్వ్యూ చూసాను. పతియే ప్రత్యక్ష దైవం అనే హెడ్డింగ్ గుర్తు. పేకేటి శివరామ్ ఆమెని రెండోపెళ్లి చేసుకున్నారు. ఆయన పాదాలకి నమస్కరిస్తూ , ఇలా మూడు నాలుగు ఫొటోలు […]
ఎన్నో సినిమాల్లో చక్కని పాత్రలు వేసి హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా అద్భుతమైన చిత్రాలు తన కీర్తి శిఖరంలో చేర్చుకున్న నిన్నటి తరం నటి జయంతి గారు ఇవాళ ఉదయం బెంగళూరులో ఆవిడ తన స్వగృహంలో కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆవిడ చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే ఈ విషాదం జరిగిపోయింది. తెలుగు తమిళ కన్నడ మలయాళంలో మర్చిపోలేని ఆణిముత్యాలు చేసిన జయంతి మరణం పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. బ్లాక్ అండ్ […]