2020 యేడాది ప్రజలను ట్వంట్వీ మ్యాచ్ అడేసింది. ఈ యేడాది మీకు బాగుంటుందని చెప్పిన రాశి ఫలితాలను కూడా అనుమానంతో చూసే విధంగా మార్చేసింది. కొత్త యేడాది ప్రారంభమయ్యాక రెండు నెలలు మినహా అన్ని రంగాల అభివృద్ది నేలచూపులనే చూస్తోంది. ఇది ఎన్నాళ్ళు అన్న ప్రశ్నలకు నిపుణులు కూడా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేని పరిస్థితులున్నాయి. దీంతో కార్పొరేట్ కంపెనీల నుంచి సగటు జీవి వరకు తమకు తోచిన విధంగా ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు విశ్వప్రయత్నాలు మొదలు పెట్టారు. […]