iDreamPost
android-app
ios-app

యువతను నిండా ముంచిన మరో ఐటీ కంపెనీ! రూ.24 కోట్లతో పరార్!

హైదరాబాద్ నగరంలో తరచూ కొన్ని కంపెనీలు, కన్సల్టెన్సీలు బోర్డు తిప్పేస్తున్నాయి. యువత నుంచి భారీ మొత్తంలో డబ్బులను గుంజి.. మోసం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక మోసాలు బయటపడగా..తాజాగా మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ నగరంలో తరచూ కొన్ని కంపెనీలు, కన్సల్టెన్సీలు బోర్డు తిప్పేస్తున్నాయి. యువత నుంచి భారీ మొత్తంలో డబ్బులను గుంజి.. మోసం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక మోసాలు బయటపడగా..తాజాగా మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

యువతను నిండా ముంచిన మరో ఐటీ కంపెనీ! రూ.24 కోట్లతో పరార్!

నేటికాలంలో చాలా మంది యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు టాప్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తుంటారు. మరికొందరు ఐటీ జాబ్ కోసం ఎదురు చూస్తుంటారు. అంతేకాక సాఫ్ట్ వేర్ రంగంపై యువతలో ఎక్కువగా ఆసక్తి ఉంది. అందుకే ఐటీ సెక్టార్ లోనే జాబులు పొందేందుకు చూస్తుంటారు. ఇక ఈ రంగంపై యువతకు ఉన్న మోజును  క్యాష్ చేసుకునేందుకు.. పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న కొన్ని కంపెనీలు నిరుద్యోగులను నిలువనా ముంచేస్తున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు ఇలా యువతను ముంచగా..తాజాగా మరో కంపెనీ నిండా ముంచేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

హైదరాబాద్ నగరంలో తరచూ కొన్ని కంపెనీలు, కన్సల్టెన్సీలు బోర్డు తిప్పేస్తున్నాయి. యువత నుంచి భారీ మొత్తంలో డబ్బులను గుంజి.. మోసం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక మోసాలు బయటపడగా..తాజాగా మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ లోని జాగృతి కన్సల్టెన్సీ పేరుతో ఓ ఐటీ కంపెనీ ఏర్పడింది.  అంతేకాక ఉద్యోగాలు ఇస్తామని, అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా సోషల్ మీడియాలో, డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో తెగ ప్రచారం చేసింది. ఇక వారి ప్రచారాన్ని చాలా మంది నిరుద్యోగులు నమ్మి కంపెనీకి పోటెత్తారు. ఇక్కడే తన మోసాన్ని జాగృతి కన్సల్టెన్సీ అమలు చేసింది. జాబ్ కోసం వచ్చిన నిరుద్యోగులకు కొన్ని షరుతులు పెట్టింది.

ఉద్యోగం కావాలంటే 2 లక్షల రూపాయల డిపాజిట్ చేయాలని కండీషన్ పెట్టింది. సాఫ్ట్ వేర్  కంపెనీలో ఉద్యోగం కదా అని.. 1200 మంది నిరుద్యోగులు నమ్మారు. ఇదే సమయంలో తలా 2 లక్షల రూపాయలు కట్టారు. ఇలా డబ్బులు కట్టిన వాళ్లకు ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇచ్చింది. లెటర్స్ ఫేక్ కావడంతో పాటు ఫేక్  ఉద్యోగాలు కూడా ఇచ్చింది.. ఆఫీసు మాదిరిగా ఏర్పాటుచేసి.. అక్కడ ఎంపికైన వారికి సీట్లు కూడా ఏర్పాటు చేసింది. కాకపోతే శాలరీ మాత్రమే ఇవ్వలేదు. అలా ఒకనెల కాదు.. ఏకంగా మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవటంతో ఉద్యోగులకు సందేహం వచ్చింది. దీంతో వెంటనే కంపెనీ నిర్వహాకులను నిలదీశారు ఉద్యోగులు. శాలరీ అయినా ఇవ్వండి, లేకుంటే తాము కట్టిన రూ.2లక్షలైనా తిరిగి ఇవ్వండి అంటూ డిమాండ్ చేశారు.

ఇక ఉద్యోగులు ప్రశ్నంచడం, పరిస్థితులు చేయిదాటి పోవటంతో జూబ్లీహిల్స్ లోని జాగృతి కన్సల్టెన్సీ రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసింది. మొత్తం 1200 మంది నుంచి రూ.24 కోట్లను జాగృతి కన్సల్టెన్సీ డైరెక్టర్ జగదీశ్ వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆఫీసుకు తాళాలు వేసి పారిపోయారని, కంపెనీ మోసం చేసిందంటూ పోలీస్ ఫిర్యాదు ఇచ్చారు. ఇలా జాబ్స్ పేరుతో యువతను మోసం చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా అనేక సార్లు.. చాలా కంపెనీలు కూడా మోసం చేశాయి. గతంలో కొన్ని బండా సంస్థ సంస్థళు తొలుత సాఫ్ట్ వేర్ శిక్షణా సంస్థ పేరుతో ప్రారంభమై.. ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిండా ముంచేస్తున్నారు.