Arjun Suravaram
ఐటీ రంగంలో అప్పుడప్పుడు కుదుపులు వస్తుంటాయి. ఆర్థికమాద్యం కారణంగా గతంలో ఓ సారి ఐటీ రంగంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితి వస్తోందని ఐటీ నిపుణులు అభిప్రాయా పడుతున్నారు.
ఐటీ రంగంలో అప్పుడప్పుడు కుదుపులు వస్తుంటాయి. ఆర్థికమాద్యం కారణంగా గతంలో ఓ సారి ఐటీ రంగంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితి వస్తోందని ఐటీ నిపుణులు అభిప్రాయా పడుతున్నారు.
Arjun Suravaram
నేటికాలంలో ఏ ఒక్కరిని కదిలించిన…సాఫ్ట్ వేర్ అనే పదం వినిపిస్తుంది. ఈ రంగంలో మంచి జీతాలు వస్తాయనేది చాలా మంది నమ్మకం. అందుకే సాఫ్ట్ వేర్ వాళ్లకే త్వరగా పెళ్లిళ్లు అవుతుంటాయి. అంతేకాక ఏ రంగంలో లేని విధంగా ఈ రంగంలో మంచి జీతం వస్తుంది. అయితే ఈ ఐటీ రంగంలో కూడా అప్పుడప్పుడు కుదుపులకు గురవుతుంది. ఆర్థికమాద్యం వచ్చినప్పుడు మాత్రం ఐటీ ఉద్యోగుల..జాబ్స్ కి గ్యారెంటీ ఉండదు. పదేళ్ల క్రితం ఇలాంటి ఆర్థిక మాద్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఐటీ రంగంలో భారీగా కోతలు ఉండనున్నాయని ఐటీ నిపుణులు అంటున్నారు. అందుకు కారణం యూఎస్ఏలో ఆర్థిక మాద్యం రాబోతుందనే వార్తలే. కొందరు ఐటీ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
సంక్షోభంలో ఉన్న భారతీయ ఐటీ రంగానికి ఓ వార్త సంచలనం రేపుతోంది. 2024 ఆర్థిక సంవత్సరం కూడా అతలాకుతలమేనని ప్రముఖ మార్కెటింగ్ నిపుణులు బాంబ్ పేల్చారు. అయితే 2025లో ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్ట్స్ డీల్స్ మెరుగుపేడ అవకాశం ఉందని భావించారు. ఇటీవలే తమ పరిశీలనలో భారత ఐటీ రంగంలో చెప్పుకోదగిన పురోగతి కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఏ ఇంటర్నేషన్ల్ వార్తల్లో చూసిన 2024అమెరికా ఆర్థికమాద్యమం ఎదుర్కొబోతుందని చెబుతున్నాయి.
ఇప్పటికే మనదేశంలోని పలు టాప్ కంపెనీలు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇటీవల భారత ఐటీ రంగంలో చెప్పుకోదగిన పురోగతి కనిపించలేదంటున్నారు. అమెరికా నుంచి ఆశించిన స్థాయిలో ప్రాజెక్ట్ రావడం లేదని, దీంతో ఐటీ సంస్థలో తమ ఉద్యోగుల్లోని కొందరు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం పరిస్థితి మునపటి త్రైమాసికంతో పోలిస్తే పరిస్థితి మెరుగ్గా లేదంట. అలాగే దీర్ఘకాలం అధిక వడ్డీరేట్లు కొనసాగితే ఆర్థిక వృద్ధి మందమనం భయాలతో పరిస్థితి ప్రతికూలమని ప్రముఖ ఐటీ సంస్ధలన్ని గతంలోనే హెచ్చరించాయి.
ఎక్కువ యుఎస్ బేస్డ్ క్లయింట్లు కావడంతో తమ ఐటీ వ్యయాన్ని తగ్గించడం, కాంట్రాక్టులను కూడా రద్దు లేదా ఆలస్యం అవుతాయని ఐటీ ప్రముఖలు తెలిపారు. ఇప్పటికే భారత్ సహా, దిగ్గజ ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. ఆదాయాలు క్షీణించాయి ఫలితంగా ఉద్యోగ నియామకాలు గణనీయంగా పడిపోయాయి. అంతేకాక ప్రాజెక్టులు లేక బెంచ్ మీద ఉద్యోగులను చాలా మందిని ఇంటికి పంపించేశాయి.
ఆన్ బోర్డింగ్ జాప్యంతో పాటు, క్యాంపస్ రిక్రూట్ మెంట్లపై దెబ్బ పడింది. ఐటీ, టెక్ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు ఉద్వాసనంకు గురయ్యారు. ఇప్పటికే 2023 సంవత్సరంలో 2.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు.. తమ జాబ్ ను కోల్పోయారు. ఇంతంద ఆర్థిక మాద్యం చూడక ముందు జరిగిన తొలగింపులు. 2024లో ఆర్థికమాద్యం వచ్చినట్లు అయితే ఈ సంఖ్య మరింత పెరగొచ్చని ఐటీ నిపుణులు అంటున్నారు.