ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ లో నీటిపారుదల శాఖకి భారీగా నిధులు కేటాయించారు. 2022-23 సంవత్సరానికి తాజా బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎపి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. 2,56,256 కోట్ల భారీ బడ్జెట్ ని సభ ముందు ఉంచారు. అందులో సంక్షేమం, అభివృద్ధి కి సమ ప్రాధాన్యతనిచ్చినట్టు కనిపిస్తోంది. నీటిపారుదల రంగంలో పురోగతికి అనుగుణంగా ఈసారి కేటాయింపు జరిగిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా పోలవరం, వెలిగొండ వంటి సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి […]
ముసురు.. ఈ మాట విని పదేళ్లు దాటింది. ఎప్పుడో 2010కి ముందు ఈ మాట ఆంధ్రప్రదేశ్లో వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. ఈ మధ్యలో పదేళ్లలో ముసురు కాదు కదా వరుణుడి జాడ కనిపించడమే గగనమైంది. చాలీచాలనీ వర్షాలు, కరువుతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసింది. గొడ్డు, గొదకు అవసరమైన నీళ్లు కూడా దొరక్క ప్రజలు అల్లాడిపోయారు. భూగర్భజలాలు అడగంటిపోయాయి. 500 అడుగుల లోతు బోర్లు […]
ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కా ప్లాన్తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మన పాలన – మీ సూచన కార్యక్రమంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, పూర్తిపై సీఎం జగన్ ఓ క్లారిటీ ఇచ్చారు. గడిచిన కాలంలో ప్రాజెక్టుల స్థితిగతులు, రివర్స్ టెండర్లతో ప్రజాధనం ఆదా చేశామని చెప్పిన సీఎం జగన్.. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. రైతన్నకు ఎన్ని చేసినా.. నీరు లేకపోతే ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. పోలవరం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ గత రెండురోజుల నుండి పోలవరంలో పర్యటిస్తూ ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తున్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్కొన్నట్టు పోలవరం నిర్మాణం 2021-22 ఆర్ధిక సంవత్సరం నాటికి నిజంగా పూర్తి అవుతుందా అనే సందేహం రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా నెలకొని వుంది. ప్రాజెక్ట్ పురోగతి పై […]