iDreamPost
android-app
ios-app

ప్రాజెక్టుల పూర్తిపై పక్కా ప్లాన్‌తో సీఎం జగన్‌

ప్రాజెక్టుల పూర్తిపై పక్కా ప్లాన్‌తో సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మన పాలన – మీ సూచన కార్యక్రమంలో రాష్ట్రంలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణం, పూర్తిపై సీఎం జగన్‌ ఓ క్లారిటీ ఇచ్చారు. గడిచిన కాలంలో ప్రాజెక్టుల స్థితిగతులు, రివర్స్‌ టెండర్లతో ప్రజాధనం ఆదా చేశామని చెప్పిన సీఎం జగన్‌.. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. రైతన్నకు ఎన్ని చేసినా.. నీరు లేకపోతే ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.

పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేస్తామని సీఎం జగన్‌ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టులో మొదటి టెన్నల్‌ను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు. వంశధార, నాగావళి, సంగం, అవుకు టెన్నల్‌ను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచుతామని చెప్పారు. 25 వేల క్యూసెక్కులు కృష్ణా డెల్టాకు సరిపోతాయని, మిగతా 25 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలిస్తామని చెప్పారు.