భారతదేశంలో ఏదైనా నేరానికి ఉరిశిక్ష ఖరారైన తర్వాత, నిందితులకు ఆ శిక్షను తప్పించుకోవడానికి లేదా ఉరిశిక్ష అమలు జాప్యం చేయడానికి పలు మార్గాలు ఉన్నాయి. అందులో భాగంగా రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ల రూపంలో వివిధ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా ఉరిశిక్ష నుండి తప్పించుకునే ప్రయత్నాలు నిందితులు చేయవచ్చు. ఇలా పలు పిటిషన్లు దాఖలు చేయడం వలన ఉరిశిక్ష రద్దు కావొచ్చు, లేదా ఉరిశిక్ష అమలు కావడం జాప్యం కావొచ్చు.. […]