iDreamPost
android-app
ios-app

మమ్ముట్టిపై కేసు.. ఆ యాడ్​లో నటించడమే ఆయన చేసిన తప్పా?

  • Author singhj Published - 01:02 PM, Wed - 27 September 23
  • Author singhj Published - 01:02 PM, Wed - 27 September 23
మమ్ముట్టిపై కేసు.. ఆ యాడ్​లో నటించడమే ఆయన చేసిన తప్పా?

ఫిల్మ్ స్టార్స్​కు ప్రేక్షకుల్లో ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. మన దేశంలోనైతే ఇదీ మరీ ఎక్కువ. క్రికెటర్లు, సినిమా స్టార్లను దేవుళ్లుగా భావించే అభిమానులు కూడా ఉన్నారు. మూవీ సెలబ్రిటీలకు అందులోనూ హీరోలకు ఉండే ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. హీరోలు చేస్తున్న సినిమాలతో పాటు వాళ్ల పర్సనల్ లైఫ్​లోని విశేషాలను తెలుసుకునేందుకు కూడా అభిమానులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సినిమాలు చూసే ప్రేక్షకులు, అభిమానులే కాదు సాధారణ ప్రజల్లో కూడా హీరోలకు మంచి గుర్తింపు ఉంటుంది. స్టార్స్ ఎక్కడికి వెళ్లినా వాళ్లను జనాలు చుట్టేస్తారు. ఒక హీరో ఏదైనా ఫంక్షన్​కు వస్తున్నారంటే అక్కడ క్షణాల్లో వేలాది మంది గుమిగూడతారు.

హీరో, హీరోయిన్లకు ఉండే పాపులారిటీ, ఫేమ్, క్రేజ్​ను క్యాష్ చేసుకునేందుకు పాపులర్ బ్రాండ్స్ పోటీపడుతుంటాయి. తమ కంపెనీ తరఫున ఒక్క యాడ్ చేసినా సేల్స్ పెరుగుతాయని, బ్రాండ్​కు బాగా పేరు వస్తుందని అనుకుంటారు. అందుకోసం రూ.కోట్లు కుమ్మరించేందుకూ వెనుకాడవు. జస్ట్ కొన్ని క్షణాల పాటు కనిపించే అడ్వర్టయిజ్​మెంట్ కోసం సెలబ్రిటీలకు రూ.కోట్లు ముట్టజెబుతుంటారని టాక్. అయితే యాడ్స్​లో నటించడం ద్వారా వచ్చే డబ్బు గురించి పక్కనబెడితే ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆ మధ్య ఒక పాన్ మసాలా కంపెనీ యాడ్​లో నటించినందుకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా అక్షయ్​లాగే గతంలో ఇబ్బందుల్లో పడ్డారు.

ఒక యాడ్​లో నటించినందుకు మమ్ముట్టిపై కేసు నమోదైంది. ఒక ఫెయిర్​నెస్ సబ్బుకు ప్రచారకర్తగా ఈ స్టార్ హీరో వ్యవహరిస్తున్నారు. అయితే ఆ యాడ్ చూసిన ఒక వ్యక్తి దానిని ఏడాదిగా వాడుతున్నాడు. ఇంతకాలం వాడినా ఆ యాడ్​లో చూపించినట్లు చర్మం రంగు మారకపోవడంతో కన్​జ్యూమర్ కోర్టును ఆశ్రయించి.. సబ్సు కంపెనీతో పాటు దానికి ప్రచారం చేసిన మమ్ముట్టి మీద కేసు పెట్టాడు. ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. తన వృత్తిలో భాగంగా మాత్రమే ఇలాంటి యాడ్స్​లో నటించారని మమ్ముట్టి తరఫు న్యాయవాది తెలిపారు. ఇది జరిగి చాన్నాళ్లే అవుతున్నా సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. మరి.. సెలబ్రిటీలు చేసే ఇలాంటి యాడ్స్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: దొంగ దొరికాడంటూ నిత్యా మీనన్ పోస్ట్!

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis