లైగర్ డిజాస్టర్ ఫలితం విజయ్ దేవరకొండని బాగా నిరాశపరిచింది. మూడేళ్ళ కష్టానికి కనీస ప్రతిఫలం దక్కకపోవడం పట్ల అభిమానులు సైతం బాగా ఫీలయ్యారు. టయర్ టూ హీరోల్లో అతి పెద్ద డిజాస్టర్ రికార్డు రౌడీ హీరో పేరు మీదకు వచ్చేయడం మరో బాధ కలిగించే అంశం. దెబ్బకు పూరి జగన్నాధ్ తో ఇంకా భారీ బడ్జెట్ తో నెక్స్ట్ ప్లాన్ చేసుకున్న జనగణమనని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇది అఫీషియల్ గా చెప్పకపోయినా హోల్డ్ లో పెట్టేశారని […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగు స్టార్ హీరోల సినిమాల మీద మనసు పారేసుకుంటున్నాడు. హిందీలో యమా బిజీగా ఉన్నప్పటికీ ఎందుకనో మన హీరోలతో జట్టు కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఆల్రెడీ గాడ్ ఫాదర్ లో చిరంజీవితో కలిసి ముఖ్యమైన క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి డాన్స్ చేసే పాట కూడా ఉంది. త్వరలోనే దాన్ని పిక్చరైజ్ చేయబోతున్నారు. ఈ పాత్ర వల్ల సినిమాకు ప్యాన్ ఇండియా లెవెల్ లో రీచ్ వస్తుందని […]
ప్రస్తుతం హరిహర వీరమల్లు పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇదయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూట్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇంకా క్లారిటీ రాలేదు. దీనికన్నా ముందు వినోదయ సితం రీమేక్ చేస్తారనే వార్తలు గట్టిగానే వచ్చాయి కానీ ఎందుకనో దానికి సంబంధించిన అప్ డేట్స్ ఆగిపోయాయి. ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన సముతిరఖని డైరెక్షన్ లో పవన్ తో పాటు సాయి ధరమ్ […]