iDreamPost
android-app
ios-app

Mirapakay Movie Sequel: సీక్వెల్‌ గా ‘మిరపకాయ్‌’ మరింత ఘాటుగా రానుందా?

  • Published Dec 15, 2023 | 1:22 PM Updated Updated Dec 15, 2023 | 1:22 PM

పవన్ కళ్యాణ్ తో రూపొందిస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమా షూటింగ్‌ మధ్య లో ఆగి పోవడంతో దర్శకుడు హరీష్ శంకర్‌ ఈ బ్రేక్ సమయంలో రవితేజతో ఒక సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించబోతున్న ఈ సినిమా మిరపకాయ్ కి సీక్వెల్‌ అయ్యి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ తో రూపొందిస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమా షూటింగ్‌ మధ్య లో ఆగి పోవడంతో దర్శకుడు హరీష్ శంకర్‌ ఈ బ్రేక్ సమయంలో రవితేజతో ఒక సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించబోతున్న ఈ సినిమా మిరపకాయ్ కి సీక్వెల్‌ అయ్యి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

  • Published Dec 15, 2023 | 1:22 PMUpdated Dec 15, 2023 | 1:22 PM
Mirapakay Movie Sequel: సీక్వెల్‌ గా ‘మిరపకాయ్‌’ మరింత ఘాటుగా రానుందా?

పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమాను ప్రారంభించిన దర్శకుడు హరీష్ శంకర్‌ ఎంతకూ ఆ సినిమా పూర్తి అయ్యే పరిస్థితి కనిపించక పోవడంతో మరో సినిమాను మొదలు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల హడావుడి పూర్తి అయ్యే వరకు అంటే కనీసం నాలుగు అయిదు నెలల పాటు పవన్‌ కళ్యాణ్ కెమెరా ముందుకు వచ్చే అవకాశాలు లేవు. అందుకే పవన్‌ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా కంటే ముందు రవితేజ తో ఒక సినిమాను చేయాలని నిర్ణయించుకున్న దర్శకుడు హరీష్ శంకర్‌ అందుకు తగ్గట్లుగా అడుగులు వేస్తున్నాడు. చాలా రోజుల క్రితమే రవితేజ కోసం హరీష్ శంకర్‌ కథ ను రాసుకున్నాడట. ఆ కథతో ఇప్పుడు హరీష్ శంకర్‌ సినిమా రూపొందించబోతున్నాడు. అయితే ఆ కథ మిరపకాయ్ సినిమాకు సీక్వెల్‌ అనే ప్రచారం మొదలైంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ వారు ఇప్పటికే అధికారికంగా రవితేజ, హరీష్ శంకర్‌ కాంబోలో సినిమాను ప్రకటించడం జరిగింది. వీరి కాంబో సినిమా మరో మాస్ హిట్ సినిమాను ఇవ్వబోతుంది అంటూ ప్రకటించారు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్‌ తదుపరి సినిమాను పవన్ తో చేసేందుకు రెడీ అయ్యాడు కానీ ఆ సినిమా ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశం కనిపించడం లేదు.

అందుకే రవితేజ తో సినిమాను షురూ చేసేందుకు హరీష్ శంకర్ రెడీ అవ్వడం శుభ పరిణామం అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ మరియు హరీష్ శంకర్ కాంబోలో గతంలో షాక్ మరియు మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. షాక్ ఫ్లాప్ అయినా మిరపకాయ్ మూవీ సూపర్‌ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా కి సీక్వెల్‌ చేస్తే బాగుంటుంది అంటూ గతంలో రవితేజతో పాటు హరీష్ శంకర్  కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఇద్దరి కాంబో సినిమా ప్రకటన రాగానే చాలా మంది మిరపకాయ్ సీక్వెల్‌ అయ్యి ఉంటుందని, గతంలో వచ్చిన మిరపకాయ్ మూవీ కంటే ఇప్పుడు సీక్వెల్‌ గా రాబోతున్న మిరపకాయ్ మూవీ మరింత ఘాటుగా ఉంటుంది అనే నమ్మకాన్ని, విశ్వసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మిరపకాయ్ సీక్వెల్‌ అంటూ జరుగుతున్న ప్రచారం విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన, క్లారిటీ రాలేదు. ఇంకా షూటింగ్ ను ప్రారంభించలేదు కనుక ముందు ముందు అయినా ఈ విషయంపై దర్శకుడు హరీష్ శంకర్‌ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ ను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరి కాంబోలో మూవీ రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి వీరి కాంబోలో వచ్చేది మిరపకాయ్‌ మూవీ సీక్వెల్ కావాలని మీరు కోరుకుంటున్నారా? లేదా కొత్త కథ తో సినిమా ఉండాలని కోరుకుంటున్నారా?

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio