iDreamPost
android-app
ios-app

చిరు వెంకీ తర్వాత పవన్ – సల్మాన్ సిరీస్

  • Published Jun 09, 2022 | 3:18 PM Updated Updated Jun 09, 2022 | 3:18 PM
  • Published Jun 09, 2022 | 3:18 PMUpdated Jun 09, 2022 | 3:18 PM
చిరు వెంకీ తర్వాత పవన్ – సల్మాన్ సిరీస్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగు స్టార్ హీరోల సినిమాల మీద మనసు పారేసుకుంటున్నాడు. హిందీలో యమా బిజీగా ఉన్నప్పటికీ ఎందుకనో మన హీరోలతో జట్టు కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఆల్రెడీ గాడ్ ఫాదర్ లో చిరంజీవితో కలిసి ముఖ్యమైన క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి డాన్స్ చేసే పాట కూడా ఉంది. త్వరలోనే దాన్ని పిక్చరైజ్ చేయబోతున్నారు. ఈ పాత్ర వల్ల సినిమాకు ప్యాన్ ఇండియా లెవెల్ లో రీచ్ వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మలయాళం ఒరిజినల్ లూసిఫర్ చూసినవాళ్లు జాతీయ స్థాయిలో తక్కువే కాబట్టి, గాడ్ ఫాదర్ రూపంలో మార్కెట్ దొరుకుతుందనే ఆశాభావంతో ఉన్నారు బయ్యర్లు.

దీంతో పాటు సల్మాన్ ఖాన్ తన కభీ ఈద్ కభీ దీవాలిలో వెంకటేష్ ని భాగం చేయడం ఇప్పటికే మీడియాలో హైలైట్ అయ్యింది. అందులో హీరోయిన్ పూజా హెగ్డే అన్నయ్యగా కనిపిస్తారని లీక్ ఉంది కానీ ఇంకా అఫీషియల్ గా యూనిట్ నుంచి కన్ఫర్మ్ కాలేదు. సో ఇద్దరు స్టార్ హీరోలు అయ్యారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తోనూ సల్మాన్ ఖాన్ నటించే ఛాన్స్ ఉందట. భవదీయుడు భగత్ సింగ్ లో ఓ స్పెషల్ క్యామియో కోసం దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవలే సల్లు భాయ్ ని ముంబైలో ప్రత్యేకంగా కలిసి స్టోరీ మొత్తం వివరించాడట. వినగానే ఇంప్రెస్ అయిన సల్మాన్ దాదాపుగా ఎస్ అనే స్థాయిలో ఆసక్తి చూపించినట్టు ఫిలిం నగర్ టాక్. రెమ్యునరేషన్ కూడా భారీనట.

ఇదీ ఓకే అయితే మొత్తం ముగ్గురు స్టార్ హీరోలతో మూడు సినిమాల్లో చాలా తక్కువ గ్యాప్ లో నటించిన బాలీవుడ్ హీరోగా సల్మాన్ ఖాన్ ఇందులోనూ ప్రత్యేకత చూపించబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ దెబ్బకు మన సత్తా ఏంటో బాలీవుడ్ జనాలకు బాగా అర్థమైపోయింది. తక్కువంచనా వేసిన కన్నడ కెజిఎఫ్ కూడా టాప్ బ్లాక్ బస్టర్ గా నిలవడం చూసి వాళ్లకు నోటమాట రావడం లేదు. మరోవైపు గత మూడేళ్ళలో పట్టుమని నాలుగు వందల కోట్లు తెచ్చిన హిందీ సినిమా ఏదీ లేదు. కాశ్మీర్ ఫైల్స్ నయం. మూడు వందల కోట్లకు దగ్గరగా వెళ్ళింది. ఇలాంటి పరిస్థితిలో సల్మాన్ లాంటి వాళ్ళు మన హీరోలు దర్శకుల మీద ఆసక్తి చూపించడంలో ఆశ్చర్యం ఏముంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş