iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండతో హరీష్ సినిమా ?

  • Published Sep 07, 2022 | 5:46 PM Updated Updated Dec 07, 2023 | 10:44 AM

టయర్ టూ హీరోల్లో అతి పెద్ద డిజాస్టర్ రికార్డు రౌడీ హీరో పేరు మీదకు వచ్చేయడం మరో బాధ కలిగించే అంశం.

టయర్ టూ హీరోల్లో అతి పెద్ద డిజాస్టర్ రికార్డు రౌడీ హీరో పేరు మీదకు వచ్చేయడం మరో బాధ కలిగించే అంశం.

విజయ్ దేవరకొండతో హరీష్ సినిమా ?

లైగర్ డిజాస్టర్ ఫలితం విజయ్ దేవరకొండని బాగా నిరాశపరిచింది. మూడేళ్ళ కష్టానికి కనీస ప్రతిఫలం దక్కకపోవడం పట్ల అభిమానులు సైతం బాగా ఫీలయ్యారు. టయర్ టూ హీరోల్లో అతి పెద్ద డిజాస్టర్ రికార్డు రౌడీ హీరో పేరు మీదకు వచ్చేయడం మరో బాధ కలిగించే అంశం. దెబ్బకు పూరి జగన్నాధ్ తో ఇంకా భారీ బడ్జెట్ తో నెక్స్ట్ ప్లాన్ చేసుకున్న జనగణమనని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇది అఫీషియల్ గా చెప్పకపోయినా హోల్డ్ లో పెట్టేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే మీడియా సంస్థలు దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ఛార్మీ కన్నా చాలా ముందు రిలీజ్ రోజు నుంచే విజయ్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు.

ఇక మ్యాటర్ లోకి వెళ్తే విజయ్ దేవరకొండ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా గురించిన టాక్ ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటి పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ చేయాలి కదానే డౌట్ రావడం సహజం. కానీ అది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఈలోగా ఆ గ్యాప్ తో ఇది ప్లాన్ చేసుకునే ఆలోచన జరుగుతోందట. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి పూర్తి చేయాల్సి ఉంది. లైగర్ ప్రమోషన్ల కోసం బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు రీ స్టార్ట్ చేసి వేగవంతం చేశారు. ఇందులో సమంతా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ మూడో వారం రిలీజని గతంలో ప్రకటించారు కానీ ఎంతవరకు సాధ్యమో వేచి చూడాలి.

తర్వాత సుకుమార్ తో విజయ్ కు ఓ కమిట్ మెంట్ ఉన్నప్పటికీ ఆయనేమో ఇంకా పుష్ప 2నే మొదలుపెట్టలేదు. అదయ్యేలోగా 2023 గడిచిపోతుంది. సో అప్పటిదాకా ఖాళీగా ఉండలేడు. పవన్ ఒకవేళ భవదీయుడు లేట్ అంటే 2024 ఎన్నికలు అయ్యాకే తీయాల్సి ఉంటుంది. ఈలోగా ఈజీగా రౌడీ హీరోది పూర్తి చేయొచ్చు. లైగర్ రిజల్ట్ విజయ్ దేవరకొండ తీవ్ర పునరాలోచనలో పడేసింది. కేవలం డైరెక్టర్ బ్రాండ్ చూసుకుని కథా కథనాలు పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా అర్థమయ్యింది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్లే దీనికన్నా నయమనేంత బ్యాడ్ టాక్ రావడం ఇబ్బందే. ఇప్పుడీ కాంబోని దిల్ రాజు సెట్ చేస్తారని మరో అప్డేట్. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది